rakul: ఎన్టీఆర్ తో డాన్స్ అంటే చాలా టెన్షనే!: రకుల్

షార్ట్స్‌లో చూడండి
సినిమాల్లో మాస్ ఆడియన్స్  ఎక్కువగా ఇష్టపడేది పాటలు .. డాన్సులే. తమ హీరో డాన్సులు అదరగొట్టేయాలని అభిమానులంతా ఆశపడుతుంటారు. వాళ్లని నిరాశ పరచకూడదనే ఉద్దేశంతో హీరోలు చాలా కష్టపడుతుంటారు. తెలుగులోని యువ కథానాయకులలో ఎన్టీఆర్ .. అల్లు అర్జున్ .. చరణ్ లకు మంచి డాన్సర్లుగా కూడా క్రేజ్ వుంది. అలాంటి హీరోలతో కలిసి స్టెప్స్ వేయడమంటే హీరోయిన్లకి ఒక పరీక్ష లాంటిదేనని రకుల్ అంటోంది.

 అల్లు అర్జున్ .. చరణ్ అద్భుతంగా డాన్స్ చేస్తారనీ .. అయితే వాళ్లు కొంతసేపు రిహార్సల్స్ చేసి ఆ తరువాత టేక్ కి వెళ్లడం జరుగుతూ ఉంటుందని రకుల్ చెబుతోంది. ఇక ఎన్టీఆర్ మాత్రం .. కొరియో గ్రాఫర్ ఒక స్టెప్ ను ఒకసారి చేసి చూపించగానే టేక్ కి వెళ్లిపోవడానికి రెడీ అవుతాడని అంటోంది. దాంతో తనలాంటి వారికి టెన్షన్ మొదలవుతుందని చెబుతోంది. అందుకే ముందుగా తనకి ఆ స్టెప్ చూపించి ఆ తరువాత ఎన్టీఆర్ కి చూపించమని కొరియో గ్రాఫర్స్ ను రిక్వెస్ట్ చేస్తుంటానని చెప్పుకొచ్చింది.   
Go Back to Shorts
rakul

More Telugu News