సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం

*  మామూలు గ్లామర్ ప్రధానమైన పాత్రల కంటే, కష్టపడి చేయాల్సిన పాత్రలకే నేనెప్పుడూ మొగ్గుచూపుతాను.. అంటోంది స్వీటీ అనుష్క. "ఇలాంటి పాత్రలకు శ్రమటోడ్చాలన్న విషయం నాకు తెలుసు. అలా కష్టపడినప్పుడే కదా పేరు కూడా వస్తుంది. అందుకే కష్టమైనా అలాంటి పాత్రలు చేసే అవకాశం వస్తే కనుక వదులుకోను' అని చెప్పింది.
*  డా.రాజశేఖర్ కథానాయకుడుగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'గరుడ వేగ' చిత్రం షూటింగ్ జార్జియాలో ముగిసింది. తదుపరి షూటింగును థాయిలాండ్ లో నిర్వహిస్తారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
*  గతంలో 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' చిత్రం ద్వారా మంచి పేరు తెచ్చుకున్న హాస్య నటుడు సప్తగిరి ఇప్పుడు 'సప్తగిరి సూపర్ ఫాస్ట్' చిత్రంలో నటిస్తున్నాడు. హర్ష వర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ నిన్న హైదరాబాదులో మొదలైంది.
*  మహేశ్ బాబు నటిస్తున్న 'స్పైడర్' చిత్రం తమిళ వెర్షన్ థియేట్రికల్  ట్రైలర్ ను రెడీ చేస్తున్నారు. సూపర్ స్టార్ అజిత్ నటించిన 'వివేగం' చిత్రంతో పాటుగా ఈ ట్రైలర్ ను తమిళ నాట ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.     
anushka
mahesh

More Telugu News