రీమేక్ ల జోలికి మాత్రం వెళ్లనంటోన్న సాయిపల్లవి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రీమేక్ ల జోలికి మాత్రం వెళ్లనంటోన్న సాయిపల్లవి

దాదాపు పది, పదిహేను సినిమాలు చేసిన తరువాత వచ్చే క్రేజ్, కొంతమందికి ఒక్క సినిమాతోనే వచ్చేస్తుంటుంది. అలాంటి అరుదైన అదృష్టాన్ని సొంతం చేసుకున్న అతికొద్ది మంది కథానాయికలలో సాయిపల్లవి ఒకరనే చెప్పాలి. సాయిపల్లవి పెద్ద అందగత్తె కాకపోవచ్చు... కానీ సహజమైన నటనతో కట్టిపడేయడం ఆమె ప్రత్యేకత. అదే ఇప్పుడు ఆమెకి వరుస అవకాశాలు వచ్చేలా చేస్తోంది.

అలాంటి సాయిపల్లవి... రీమేక్ ల జోలికి మాత్రం వెళ్లనని చెప్పేసింది. 'ఫిదా' సినిమాను తమిళంలో గానీ... మలయాళంలో గాని రీమేక్ చేస్తే నటించడానికి ఉత్సాహాన్ని చూపుతారా? అనే ప్రశ్నకి సమాధానంగా ఆమె ఈ మాట అంది. ఒరిజినల్ కంటెంట్ ను మాత్రమే చేస్తాననీ... రీమేక్ లు మాత్రం చేయనని స్పష్టం చేసింది. 'ప్రేమమ్' లో మలార్ పాత్ర, 'ఫిదా'లో భానుమతి పాత్ర ఒరిజినల్ కంటెంట్ కనుకనే తనకి అంతటి పేరు వచ్చిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.       
sai pallavi

More Telugu News