డాక్టర్ ను కావాలనే కలను నిజం చేసుకు తీరతానన్న సాయిపల్లవి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డాక్టర్ ను కావాలనే కలను నిజం చేసుకు తీరతానన్న సాయిపల్లవి

అప్పట్లో కొంతమంది నటీనటులను పలకరిస్తే చాలు .. డాక్టర్ ను కాబోయి యాక్టర్ ను అయ్యానని చెబుతుండేవారు. అయితే ఒకసారి నటన వైపుకు వచ్చాక మళ్లీ డాక్టార్ కావాలనే కల గురించి ఆలోచించిన వాళ్లు చాలా తక్కువనే చెప్పాలి. వాళ్లంతా కూడా నటనపైనే పూర్తి శ్రద్ధ పెట్టారు .. నటననే కెరియర్ గా మలచుకుని ముందుకు సాగారు.

 అందుకు తాను పూర్తి భిన్నమని చెబుతోంది 'ఫిదా' కథానాయిక సాయిపల్లవి. ఒక వైపున శాస్త్రీయ నృత్యం నేర్చుకుంటూనే  జార్జియాలో ఆమె ఎంబిబిఎస్ చదివింది. డాక్టర్ ను కావాలనే ఆశయంతో వున్న తనకి అనుకోకుండా కథానాయికగా అవకాశాలు వచ్చాయని చెప్పింది. అలా వచ్చిన పాత్రలు తనకి మంచి పేరు తెచ్చి పెడుతుండటం విశేషమని అంది. నటిగా తనకి ఎంత క్రేజ్ వచ్చినా .. డాక్టర్ ను కావాలనే తన కలను నిజం చేసుకు తీరుతానని స్పష్టం చేసింది.
sai pallavi

More Telugu News