మహేశ్ 'భరత్ అను నేను' శాటిలైట్ రైట్స్ 25 కోట్లు?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ 'భరత్ అను నేను' శాటిలైట్ రైట్స్ 25 కోట్లు?

సహజంగానే మహేశ్ సినిమాలకి బిజినెస్ .. శాటిలైట్ రైట్స్ రేటు ఒక రేంజ్ లో ఉంటూ ఉంటాయి. కొరటాల - మహేశ్ బాబు సినిమాకి సంబంధించి కూడా అదే పద్ధతి కొనసాగనున్నట్టుగా తెలుస్తోంది. కొరటాల దర్శకత్వంలో మహేశ్ బాబు .. 'భరత్ అను నేను' అనే సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగులో మహేశ్ బాబు బిజీగా వున్నాడు.

 ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం టీవీ చానల్స్ పోటీ పడుతున్నాయి. 20 కోట్లకి శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకోవడానికి ఆసక్తిని చూపుతున్నాయని సమాచారం. అయితే నిర్మాత దానయ్య 25 కోట్ల వరకూ చెబుతున్నారట. 20 నుంచి 25 కోట్ల మధ్యలో రెండు మూడు రోజుల్లో డీల్ సెటిల్ కావొచ్చని అంటున్నారు. ఇంతవరకూ 15 .. 16 కోట్ల లోపే జరిగిన శాటిలైట్ రైట్స్ బిజినెస్, ఈ సినిమాతో 20 కోట్ల పైకి చేరుకోవడం విశేషమేనని చెప్పుకుంటున్నారు.
mahesh babu

More Telugu News