Thamanna: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం

షార్ట్స్‌లో చూడండి
*  ఇటీవల ప్రభాస్ తో కలసి 'బాహుబలి 2'లో నటించిన కథానాయిక తమన్నా మరోసారి అతనితో కలసి పనిచేయాలని కోరుకుంటోంది. "ప్రభాస్ అద్భుతమైన నటుడు, నాకు మంచిస్నేహితుడు కూడా. అతనితో షూటింగ్ చాలా సరదాగా వుంటుంది. ప్రభాస్ తో పనిచేసే మరో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను" అంటోంది ఈ మిల్కీ వైట్ బ్యూటీ.
*  సుమంత్ హీరోగా గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఆకాంక్ష సింగ్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి 'మళ్లీ రావా' అనే టైటిల్ ని నిర్ణయించారు.
*   డా.రాజశేఖర్ కథానాయకుడుగా నటిస్తున్న 'గరుడవేగ' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ఆఫీసర్ గా రాజశేఖర్ నటన అద్వితీయమని దర్శకుడు ప్రవీణ్ సత్తారు చెబుతున్నారు.  
Go Back to Shorts
Thamanna
prabhas

More Telugu News