'గర్జనై' కోసం అడవుల్లో పరుగులు తీస్తోన్న త్రిష!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'గర్జనై' కోసం అడవుల్లో పరుగులు తీస్తోన్న త్రిష!

తమిళంలో సుదీర్ఘ కాలంగా సినిమాలు చేస్తూ .. ఎంతమాత్రం క్రేజ్ తగ్గకుండా చూసుకుంటోన్న కథానాయికలలో నయనతార తరువాత త్రిష కనిపిస్తుంది. నయనతార మాదిరిగానే త్రిష కూడా కథానాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేస్తోంది. అలా ప్రస్తుతం ఆమె 'గర్జనై' చేస్తోంది. హిందీలో హిట్ కొట్టిన 'ఎన్ హెచ్ 10' సినిమాకి ఇది రీమేక్.

 రోడ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ఛేజింగులు .. అడవుల్లో పరుగులు ఒక రేంజ్ లో ఉంటాయనీ .. ఈ ఫోటో అందుకు సంబంధించినదేనని త్రిష చెబుతోంది. కథా కథనాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయని అంటోంది. సాంకేతికపరంగా ఈ సినిమా తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలుస్తుందని చెబుతోంది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను అక్టోబర్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.  
trisha

More Telugu News