పెళ్లి పనుల్లో ప్రభాస్ బిజీగా వున్నాడా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి పనుల్లో ప్రభాస్ బిజీగా వున్నాడా?

'బాహుబలి 2' తరువాత ప్రభాస్ విదేశాల్లోనే ఎక్కువగా గడిపాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత 'సాహో' సినిమా షూటింగులో పాల్గొంటాడని అన్నారు. ఈ సినిమా షూటింగ్ అయితే మొదలైంది కానీ, ప్రభాస్ జాయిన్ అయ్యాడా? లేదా? అనే విషయం మాత్రం తెలియడం లేదు. ఆయన షూటింగులో జాయిన్ అయితే ఆ వార్త తప్పనిసరిగా బయటికి వచ్చేదే.

 'బాహుబలి 2' తరువాత రానా .. అనుష్క .. తమన్నా .. ఇలా అంతా కూడా ఎవరికి సంబంధించిన సినిమా పనుల్లో వాళ్లు వున్నారు. ప్రభాస్ మాత్రం చాలా అరుదుగా సినిమా ఫంక్షన్స్ లో మెరుస్తున్నాడు. ఆ తరువాత ఆయన ఎవరికీ కనిపించడం లేదు. అందుకు కారణం పెళ్లి విషయంలో ఆయన సీరియస్ గా దృష్టి పెట్టడమేననీ, అందుకు సంబంధించిన పనుల్లోనే ఆయన వున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ చూస్తోన్న సంబంధాల్లో ఒకటి త్వరలోనే ఫైనలైజ్ కావొచ్చని చెప్పుకుంటున్నారు .   
prabhas

More Telugu News