ఇలాంటి ధోరణితోనే మీరు తెలంగాణ యువతకి కోపం తెప్పించారు: 'రాయపాటి'పై పవన్ కల్యాణ్ ధ్వజం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇలాంటి ధోరణితోనే మీరు తెలంగాణ యువతకి కోపం తెప్పించారు: 'రాయపాటి'పై పవన్ కల్యాణ్ ధ్వజం

‘పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టకండి, పెద్దలు 'రాయపాటి' గారు ఒకసారి ఆలోచించండి..’ అంటూ కొద్ది సేప‌టి క్రితం సినీన‌టుడు, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే. అనంత‌రం ఆయ‌న మ‌రో ట్వీట్ చేస్తూ... ‘ఇలాంటి వ్యాపార ధోరణి రాజకీయాలతోనే మీరు తెలంగాణ యువతకి కోపం తెప్పించి, 'ఆంధ్రోళ్ళు దోచుకుంటున్నారు' అన్న అపవాదు మొత్తం జాతికే తీసుకొచ్చారు’ అని పేర్కొన్నారు. పదవీ వ్యామోహానికి భావి తరాల భవిష్యత్తుని పాడు చేసే హక్కు మీకు లేదు అని ప‌వ‌న్ చెప్పారు.

‘రాయ‌పాటి గారు స్పెష‌ల్ స్టేట‌స్ కోసం పోరాటం చెయ్య‌రు. చేసే వారిని చెయ్య‌నివ్వ‌రు.. పైగా క‌ష్ట‌ప‌డే రైతుల ప‌చ్చ‌ని పొలాల్లో మీ పోల‌వ‌రం కాంట్రాక్టు లాభాల కోసం మ‌ట్టిని డంప్ చేయిస్తారు’ అని ప‌వ‌న్ ట్విట్ట‌ర్ వేదిక‌గా తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.
special status
pawan kalyan

More Telugu News