ఎన్నికల ముందు అలా చెప్పి.. ఇప్పుడు ఇలా చేస్తారా?: హోదాపై పవన్ కల్యాణ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్నికల ముందు అలా చెప్పి.. ఇప్పుడు ఇలా చేస్తారా?: హోదాపై పవన్ కల్యాణ్

విశాఖప‌ట్నంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ యువత తలపెట్టిన మౌన ప్రదర్శనకు మద్దతు ప్ర‌క‌టించిన జ‌న‌సేన అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్ర‌త్యేక ప్యాకేజీని పాచిపోయిన ల‌డ్డూలు అని ఆయ‌న ఈ రోజు రెండోసారి అనడం గ‌మ‌నార్హం. ‘విభ‌జ‌న‌కు ముందు పంచ‌భ‌క్ష్యాల‌తో కూడిన స్పెష‌ల్ స్టేట‌స్‌ను ఇస్తామ‌ని మాట ఇచ్చి.. ఓట్లు వేయించుకొని అధికారంలోకి వ‌చ్చి... అన్ని రాష్ట్రాల‌కి సాధార‌ణంగా ఇచ్చే నిధుల‌కి.. స్పెష‌ల్ ప్యాకేజీ అని ముసుగు తొడిగి రెండు పాచిపోయిన ల‌డ్డూలు చేతిలో పెడ‌తారా?’ అని ఆయ‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.  

అంతేగాక‌, ‘పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టకండి, పెద్దలు 'రాయపాటి' గారు ఒకసారి ఆలోచించండి..’ అని ప‌వ‌న్ వ‌రుస ట్వీట్లు చేశారు.


special status
pawan kalyan

More Telugu News