అడ్డుకుంటే దీర్ఘకాలిక పోరాటాలు వస్తాయి: ప‌వ‌న్ క‌ల్యాణ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అడ్డుకుంటే దీర్ఘకాలిక పోరాటాలు వస్తాయి: ప‌వ‌న్ క‌ల్యాణ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా కోసం రేపు విశాఖ‌ప‌ట్నంలో యువ‌త‌ చేయాల‌నుకుంటున్న శాంతియుత ఆందోళ‌న‌ను ప్ర‌భుత్వం అణ‌చివేయాల‌ని చూస్తే ఆంధ్రుల హ‌క్కుల‌ను కాపాడుకోవ‌డానికి దీర్ఘ‌కాలిక పోరాటానికి దిగాల్సి ఉంటుందని జ‌న‌సేన అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ కల్యాణ్ హెచ్చరించారు. జ‌ల్లిక‌ట్టు పోరాటం చేసిన వారికి జ‌న‌సేన‌ సెల్యూట్ చేస్తుంద‌ని, ఏపీలో ప్ర‌త్యేక హోదా పోరాటానికి ఆ ఉద్యమం స్ఫూర్తిగా నిలిచింద‌ని ఆయ‌న తాజాగా ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. ప్ర‌జ‌ల కోసం ప్ర‌భుత్వానికి ఎప్పుడు స‌హ‌క‌రించాలో.. అదే ప్ర‌జ‌ల కోసం ప్ర‌భుత్వంతో ఎప్పుడు పోరాడాలో జ‌న‌సేన‌కు తెలుసని ఆయ‌న పేర్కొన్నారు.


special status
pawan kalyan

More Telugu News