వారు మీకు వంగి వంగి స‌లాములు చేయ‌డం చూసి ఆంధ్రులు మీ బానిస‌లు అనుకోవ‌ద్దు: ప‌వ‌న్ క‌ల్యాణ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వారు మీకు వంగి వంగి స‌లాములు చేయ‌డం చూసి ఆంధ్రులు మీ బానిస‌లు అనుకోవ‌ద్దు: ప‌వ‌న్ క‌ల్యాణ్

జ‌న‌సేన అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదాపై ట్విట్ట‌ర్‌లో మ‌రో ట్వీటు చేశారు. తాజాగా ఈ రోజు ఉద‌యం ఏపీ ప్ర‌త్యేక హోదాను కోరుకుంటోందంటూ ‘ఆంధ్రులు.. ఈ దేశ ప్ర‌జ‌లు.. కేంద్రంలో ఉండే నాయ‌కుల‌కి, పార్టీల‌కి బానిస‌లు కాదు’ అంటూ ఆయ‌న ఘాటుగా స్పందించిన విష‌యం తెలిసిందే.

అనంత‌రం మ‌రో గంటసేప‌టికి మరో ట్వీటు చేస్తూ ‘ప‌ద‌వులు కోరుకునే వారు, వ్య‌క్తిగ‌త లాభం ఆశించే వారు, వ్యాపార అవ‌స‌రాలు ఉన్న వ్య‌క్తులు, నాయ‌కులు మీకు జీ హుజూర్ అని వంగి వంగి స‌లాములు చేయ‌డం చూసి ఆంధ్రులు మీ బానిస‌లు అని పొర‌ప‌డ‌వ‌ద్దు’ అని ఆయ‌న ట్వీటు చేశారు.  

రెండు రోజుల నుంచి పవన్ కల్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తోన్న ఈ ఘాటైన ట్వీట్లు చూస్తోంటే, హోదాపై ఆయన ప్రత్యక్ష పోరాటానికి దిగనున్నాడన్న విషయం తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



special status
pawan kalyan

More Telugu News