పడిపోయిన యాపిల్ ఐఫోన్ అమ్మకాలు.. యాపిల్ సీఈవో వేతనంలో కోత!
ఆయనతో పాటు తమ సంస్థ టాప్ ఎగ్జిక్యూటీవ్‌ల వేతనాల్లోనూ కోత విధించినట్లు తెలుస్తోంది. యాపిల్ ఆదాయం, నిర్వహణ లాభాలు పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ సంస్థ రాబడులు గతంలో కంటే 8 శాతం పడిపోయి రూ.14,70,204 కోట్లకు చేరగా, నిర్వహణ లాభం 16 శాతం పడిపోయి 4,08,390 కోట్లకు చేరుకుంది. ఆ సంస్థ 2007లో ఐఫోన్‌లను తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లాభాలు సాధిస్తూ మంచి ఆదాయాలను నమోదు చేసుకుంది. ఇప్పుడు తొలిసారిగా ఆదాయం పడిపోయింది.