టెస్టు జట్టులో చోటు దక్కక సిరాజ్ కన్నీళ్లు?.. లైవ్ కెమెరాలో కనిపించిన భావోద్వేగం!

Sports
Advertisement
  • సిరాజ్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపై టీమ్ మేనేజ్‌మెంట్‌పై మురళీ కార్తీక్ ఆగ్రహం
  • డగౌట్‌లో సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడని, కన్నీళ్లు పెట్టుకున్నాడని వ్యాఖ్య
  • ప్రాణం పెట్టి ఆడే బౌలర్ సిరాజ్ అని, అతడికి అన్యాయం జరుగుతోందన్న కార్తీక్
  • ఫామ్‌లో లేడనుకుంటే అసలు టూర్‌కే ఎందుకు ఎంపిక చేశారని సూటి ప్రశ్న
టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టుకు పక్కన పెట్టడంపై మాజీ స్పిన్నర్ మురళీ కార్తీక్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. జట్టు యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ, సిరాజ్‌ను సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని, అతడికి అన్ని ఫార్మాట్లలోనూ తగినన్ని అవకాశాలు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు.

మ్యాచ్ సందర్భంగా కెమెరాలు డగౌట్‌లో కూర్చున్న సిరాజ్‌పై దృష్టి సారించాయి. కళ్లజోడు వెనుక తన భావోద్వేగాలను దాచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించడంతో, అతను కన్నీళ్లు పెట్టుకున్నాడా? అని మురళీ కార్తీక్, అజింక్య రహానే చర్చించుకున్నారు. దీనిపై కార్తీక్ స్పందిస్తూ.. "సిరాజ్ చాలా భావోద్వేగమైన వ్యక్తి. అతడిని చూస్తుంటే బాధలో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది" అని వ్యాఖ్యానించాడు.

ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించినప్పుడు ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తారని కార్తీక్ తన అనుభవాలను పంచుకున్నాడు. "కొంతమంది ఆటగాళ్లు తమను పక్కనపెట్టినా పెద్దగా పట్టించుకోరు. కానీ సిరాజ్ లాంటి వాళ్లు ఎప్పుడూ ఆడాలనే తపనతో ఉంటారు. ఒంట్లో నొప్పితో బాధపడుతున్నా, జ్వరంతో వణుకుతున్నా సరే, మైదానంలోకి దిగి తమ సర్వస్వాన్ని పణంగా పెడతారు. సిరాజ్ అలాంటి బౌలరే" అని అభిప్రాయపడ్డాడు.

ఇదే సమయంలో సిరాజ్ విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ వ్యవహరిస్తున్న తీరుపై కార్తీక్ మండిపడ్డాడు. "అతడిని ఆడించాలనే ఉద్దేశం లేనప్పుడు అసలు టూర్‌కు ఎందుకు ఎంపిక చేశారు? అతని ఫామ్ బాగోలేదనో, నెట్స్‌లో సరిగ్గా బౌలింగ్ చేయడం లేదనో అనుకుంటే, పర్యటనకు తీసుకోకుండా ఉండాల్సింది. ఒక ఆటగాడిని అదనంగా తీసుకెళ్లి బెంచ్‌కే పరిమితం చేయడంలో అర్థమేంటి?" అని ఘాటుగా ప్రశ్నించాడు. 

సిరాజ్ విషయంలో యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరి తనను ఆశ్చర్యపరిచిందని, ఇది ఏమాత్రం సరికాదని కార్తీక్ స్పష్టం చేశాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Advertisement

సంబంధిత వార్తలు

Mohammed SirajIndia vs New ZealandMurali KartikIndian Cricket TeamTest Match SelectionSiraj Emotional Video

More Telugu News

కథ సుఖాంతం.. క్షేమంగా ఒడ్డుకు చేరుకున్న కాకినాడ మత్స్యకారులు

27 Nov, 12:39

చిన్న పల్లె.. పెద్ద లక్ష్యం.. 19 ఏళ్లకే రక్షణ మంత్రిత్వ శాఖలో కొలువు సాధించిన పల్లెటూరి అమ్మాయి

27 Nov, 12:37

కూకట్ పల్లి ట్రక్ పార్క్ వేలానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

27 Nov, 12:36

16 ఏళ్ల భారత కుర్రాడికి పుతిన్ ఫిదా.. మోదీ 'మేక్ ఇన్ ఇండియా'ను ప్రస్తావిస్తూ ప్రశంసలు

27 Nov, 12:35

తమిళనాడు సీఎం విజయ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ.. విచారణ తప్పదు!

27 Nov, 12:17

ఐదేళ్లలో 2.4 కోట్ల ఉద్యోగాలకు ఎసరు.. ఏఐపై జేపీ మోర్గాన్ నివేదిక

27 Nov, 12:16

టీవీఎస్ కుటుంబంలో ఆస్తి వివాదం.. తండ్రిపైనే కోర్టుకెక్కిన కుమార్తె.. కుటుంబ వ్యాపారంలో కూతుళ్లకు ఉండే హక్కులేంటి?

27 Nov, 12:05

రెండో టెస్టులో భారత బౌలర్ల రివర్స్ ఎటాక్.. చివర్లో న్యూజిలాండ్ ప్రతిఘటన, డే 1 హైలైట్స్

27 Nov, 12:03

బాధ్యతలు స్వీకరించిన వంగవీటి రాధా.. తొలి సంతకం ఏ ఫైళ్లపై చేశారంటే..!

27 Nov, 11:56

కివీస్‌తో రెండో టెస్టు.. తొలి రోజు చెమ‌టోడ్చిన భార‌త బౌల‌ర్లు

27 Nov, 11:54

స్టార్‌డమ్‌ పక్కనపెట్టిన జగపతిబాబు.. వర్కర్లతో కలిసి భోజనం: వీడియో వైరల్‌

27 Nov, 11:53

ఏఐని వాడేవాళ్లే మిమ్మల్ని రీప్లేస్ చేస్తారు: రామ్ గోపాల్ వర్మ

27 Nov, 11:28

ఏపీ తొలి విడత పంచాయతీ ఫలితాలు: కూటమిదే పైచేయి.. కొన్ని కంచుకోటల్లో షాక్

27 Nov, 11:27

రూ.11 లక్షల అలంకార దీపాలు, రూ.5.6 లక్షల కర్టెన్లు.. కేజ్రీవాల్ బంగ్లాను తెరిచిన ఢిల్లీ సర్కార్!

27 Nov, 11:25
..More Telugu News