ఐదేళ్లలో 2.4 కోట్ల ఉద్యోగాలకు ఎసరు.. ఏఐపై జేపీ మోర్గాన్ నివేదిక
Advertisement
- ఏటా 1.3 శాతం నాలెడ్జ్ వర్కర్ల ఉద్యోగాలకు ముప్పని వెల్లడి
- ఒక్క అమెరికాలోనే సుమారు 1.6 కోట్ల ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం
- లేఆఫ్స్ కంటే కొత్త నియామకాలు ఆపడం ద్వారానే సర్దుబాటు
- ప్రస్తుతం అమెరికాలో 6 శాతం పని గంటల్లోనే ఏఐ వినియోగం
- ఉద్యోగాల తొలగింపు కంటే పనుల స్వభావంలోనే ప్రధాన మార్పులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ విపణిలో తీవ్ర అలజడి మొదలుకానుంది. రాబోయే ఐదేళ్ల కాలంలో సుమారు 2.4 కోట్ల (24 మిలియన్ల) నాలెడ్జ్ వర్కర్ ఉద్యోగాలపై ఏఐ తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ జేపీ మోర్గాన్ వెల్త్ మేనేజ్‌మెంట్ నివేదిక సంచలన హెచ్చరికలు జారీ చేసింది. ఉద్యోగులు చేసే పనులను ప్రత్యామ్నాయంగా ఏఐ టెక్నాలజీతో పూర్తి చేయించేందుకు కంపెనీలు మొగ్గు చూపుతుండటమే ఇందుకు కారణమని విశ్లేషించింది.
ఈ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 1.3 శాతం నాలెడ్జ్ వర్కర్ల విభాగం ఈ మార్పుల బారిన పడనుంది. కంపెనీలు ఏఐ కోసం పెట్టే ఖర్చులో సగభాగం మానవ ఉద్యోగుల భర్తీకి వెచ్చిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. అయితే ఉద్యోగులను ఉన్నపళంగా తొలగించడం కాకుండా, ఖాళీ అయిన స్థానాలను కొత్తవారితో భర్తీ చేయకుండా ఏఐతో నడిపించే వ్యూహాన్ని సంస్థలు ఎక్కువగా అనుసరించే అవకాశముంది. ప్రత్యేకించి కొన్ని రంగాల్లో లేదా నిర్దిష్ట ప్రాంతాల్లోనే ఈ ప్రభావం కేంద్రీకృతమైతే తీవ్ర ఆర్థిక, రాజకీయ పరిణామాలు తలెత్తవచ్చని హెచ్చరించింది.
ఈ ముప్పులో సింహభాగం అమెరికాపైనే పడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభావితమయ్యే ఉద్యోగాల్లో మూడింట రెండు వంతులు ఒక్క అమెరికాలోనే ఉండవచ్చని, రాబోయే ఐదేళ్లలో అక్కడ సుమారు 1.6 కోట్ల ఉద్యోగాలపై వేటు పడవచ్చని తెలిపింది. అంటే ఏటా దాదాపు 30 లక్షల మంది ప్రభావితం కానున్నారు. ఇది 2000 దశకంలో తయారీ రంగంలో వచ్చిన ఉద్యోగాల కోత కంటే నాలుగు రెట్లు అధికమని నివేదిక స్పష్టం చేసింది.
అయినప్పటికీ ఉద్యోగాలను పూర్తిగా నిర్మూలించడం కంటే, వాటిలోని రోజువారీ బాధ్యతల్లో ఏఐ భారీ మార్పులు తీసుకురావడమే ఎక్కువగా జరుగుతుందని జేపీ మోర్గాన్ అభిప్రాయపడింది. ప్రతి ఉద్యోగంలోనూ అనేక విభాగాలు ఉంటాయని, ఏఐ ప్రస్తుతానికి కొన్ని పనులను మాత్రమే ఆటోమేట్ చేయగలదని వివరించింది. అమెరికాలో ప్రస్తుతం కేవలం 6 శాతం పని గంటల్లో మాత్రమే ఏఐ సాయం తీసుకుంటున్నారని, ఆర్థిక వ్యవస్థ అంతటా ఏఐ అమలు చాలా నెమ్మదిగా, అసమానంగా సాగుతుందని నివేదిక వెల్లడించింది.