సైబరాబాద్ సీపీ రమేశ్ రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి జైలు శిక్ష విధించిన హైకోర్టు
Advertisement
- కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు పోలీస్ అధికారులకు రెండు వారాల సాధారణ జైలు
- ఒక్కొక్కరికి రూ. 2,000 జరిమానా
- పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలు వారం రోజుల పాటు నిలుపుదల
కోర్టు ధిక్కరణ కేసులో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్ రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డిలకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేసినందుకు గాను ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులకు రెండు వారాల సాధారణ జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 2,000 చొప్పున జరిమానా విధించింది. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో వారం రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. గతంలో ఒక భూ వివాదానికి సంబంధించిన కేసులో పిటిషనర్‌కు పోలీస్ రక్షణ కల్పించాలంటూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వులను ఉన్నతాధికారులు అమలు చేయకపోవడంతో బాధితుడు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారని నిర్ధారిస్తూ రమేశ్ రెడ్డి, కోటిరెడ్డిలను దోషులుగా తేల్చి ఈ శిక్షను ఖరారు చేసింది.
అయితే, ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా జైలు శిక్ష అమలును హైకోర్టు వారం రోజుల పాటు నిలిపివేసింది. ఈ వారం రోజుల వ్యవధిలో ఉన్నత బెంచ్ నుంచి ఎలాంటి స్టే ఉత్తర్వులు తెచ్చుకోలేకపోతే, వెంటనే హైకోర్టు రిజిస్ట్రార్ ఎదుట లొంగిపోయి జైలు శిక్షను అనుభవించాలని స్పష్టం చేసింది.