ఓటుకు నోటు దొంగలు నేడు సీఎంలుగా చలామణీ అవుతున్నారు: దాసోజు శ్రవణ్
Advertisement
- ప్రజాస్వామ్యానికి ఓటు హక్కే అసలైన పునాది అన్న దాసోజు శ్రవణ్
- తెలంగాణ భవన్‌లో రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు
- రాజ్యాంగంతో చెలగాటమాడే వారికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు
భారత రాజ్యాంగం ప్రసాదించిన పవిత్రమైన ఓటు హక్కే ప్రజాస్వామ్యానికి అసలైన పునాది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆయువుపట్టు లాంటి ఓటు హక్కును నేడు నోట్లతో కొనుగోలు చేయడం, అమ్ముకోవడం వంటి అత్యంత దుర్మార్గమైన ధోరణులు పెరిగిపోయాయని దాసోజు శ్రవణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఉన్నవారే నేడు ముఖ్యమంత్రులుగా చెలామణి అవుతున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. అలాంటి వ్యక్తుల చేతుల్లోనే ప్రస్తుతం 'జై సంవిధాన్' అంటూ కొత్త రాజకీయ డ్రామాలు నడుస్తున్నాయని ఆరోపించారు.
భారత రాజ్యాంగం నిప్పులాంటిదని, దానితో ఎవరూ చెలగాటమాడలేరని ఆయన హెచ్చరించారు. రాజ్యాంగ వ్యవస్థలతో ఆడుకుంటున్న దుర్మార్గులకు తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరణలో చూపిస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలని, తద్వారా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న వారికి సరైన గుణపాఠం చెప్పాలని దాసోజు పిలుపునిచ్చారు.