బెంగళూరులో వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి.. దూరంగా జగన్

Both States
Advertisement
  • బెంగళూరు సమీపంలో షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం
  • రఘురామి రెడ్డితో క్రిస్టియన్ పద్ధతిలో జరిగిన పెళ్లి వేడుక
  • వేడుకకు హాజరైన కుటుంబ సభ్యులు
  • నేడు హిందూ సంప్రదాయంలో మరో వేడుకకు ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ దంపతుల కుమార్తె వైఎస్ అంజలీ రెడ్డి వివాహం డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డితో ఘనంగా జరిగింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో బుధవారం ఇరు కుటుంబాల అత్యంత సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో ప్రైవేట్ వేడుకగా ఈ వివాహ క్రతువు పూర్తయింది. కాగా, ఈ శుభకార్యానికి షర్మిల సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే బంధువులు కూడా దూరంగా ఉన్నారు.

తొలుత క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరిగింది. ఇరు కుటుంబాల ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ గురువారం సాయంత్రం సాంప్రదాయ హిందూ పద్ధతిలో మరోసారి వివాహ వేడుకను నిర్వహించనున్నారు. అనంతరం కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లా నంది హిల్స్ సమీపంలో ఉన్న 'ఓరా ఆకాశం' రిసార్ట్‌లో గురువారం సాయంత్రం వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ విందుకు పలువురు ప్రముఖులు, సీనియర్ రాజకీయ నాయకులు, కుటుంబ శ్రేయోభిలాషులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపనున్నారు. 

వైఎస్ అంజలీ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మనవరాలు కాగా, వరుడు డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డి.. సోమల సుబ్బా రెడ్డి, సోమల పద్మా రెడ్డి దంపతుల కుమారుడు. తమ కుమార్తె వివాహం గురించి వైఎస్ షర్మిల సెప్టెంబర్ నెలలోనే అధికారికంగా ప్రకటించారు. పెళ్లి పనుల ప్రారంభంలో భాగంగా ఇరు కుటుంబాల పెద్దలు వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించి, వైఎస్సార్ సమాధి వద్ద తొలి వివాహ పత్రికను ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.

ప్రధాన వివాహానికి ముందు ఇరు కుటుంబాల ఆధ్వర్యంలో హల్దీ సహా పలు ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఉల్లాసంగా సాగాయి. ఈ సంబరాలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకున్నాయి. కుమార్తె వివాహ మహోత్సవానికి రావాల్సిందిగా వైఎస్ షర్మిల స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిలతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు.

ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న వివాహ కార్యక్రమాలను కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులకే పరిమితం చేశారు. అయితే, రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖుల కోసం డిసెంబర్ నెలలో హైదరాబాద్‌లో భారీ స్థాయిలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. 
Advertisement

సంబంధిత వార్తలు

YS SharmilaAnjali Reddy WeddingYS Jagan Mohan ReddyNandi Hills BengaluruRaghurami ReddyVijayamma

More Telugu News

ఆమెతో జెన్స‌న్‌ హువాంగ్‌ది కేవ‌లం రొమాంటిక్ రిలేష‌న్ మాత్ర‌మే.. గూఢ‌చ‌ర్యం లాంటిదేమీ లేదు: అమెరికా

26 Nov, 08:17

రెండు కార్లు ఢీ.. 100 మీటర్లు గాల్లోకి ఎగిరిపడ్డాడు.. అయినా లేచి నడిచాడు!

26 Nov, 08:04

ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

26 Nov, 07:50

స్పేస్‌ఎక్స్‌కు అమెరికా గ్రీన్ సిగ్నల్... అంతరిక్షంలో 10 లక్షల శాటిలైట్లకు అనుమతి

26 Nov, 07:36

'జైలర్' బాల నటుడి కొత్త అడుగు.. 13 ఏళ్లకే స్నేహితులతో సాఫ్ట్‌వేర్ కంపెనీ

26 Nov, 07:23

ఆ రోజు మా అమ్మ లేకపోతే నాన్న చంపేసేవాడు.. రవికిషన్ సంచలన వ్యాఖ్యలు!

26 Nov, 07:19

గోదావరి పుష్కరాలకు రూ.1,100 కోట్లతో ఏర్పాట్లు

26 Nov, 07:06

దేశీయంగానే 84 శాతం బంగారు నిల్వలు.. విదేశాల నుంచి పసిడిని తరలిస్తున్న ఆర్‌బీఐ

26 Nov, 07:00

చుక్కలు చూపిస్తున్న విమాన ప్రయాణం.. భారీగా పెరిగిన ధరలు

26 Nov, 06:56

కుమార్తె పెళ్లి వేడుకలో విషాదం.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన తండ్రి.. అంత్యక్రియలకు ముందే వివాహం

26 Nov, 06:47

వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్ భవిష్యత్తు.. పోలికలు వద్దు: సౌరభ్ గంగూలీ

26 Nov, 06:39

హైదరాబాద్ నుంచి కాశీ, అయోధ్య యాత్రకు ఐఆర్‌సీటీసీ విమాన టూర్ ప్యాకేజీ

26 Nov, 06:30

టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ.. ఏడు వికెట్ల ఘనత సాధించిన తొలి ఆటగాడిగా ముల్డర్

26 Nov, 06:20

ఇండియన్ సినిమాను షేక్ చేసే దర్శకుల జాబితాలో కార్తీక్ చేరడం పక్కా: నెల్లూరులో నాగచైతన్య

25 Nov, 22:45
..More Telugu News