మహిళ ఆత్మహత్యను రాజకీయం చేయడం హేయమైన చర్య: భూమనపై భాను ప్రకాశ్ రెడ్డి ఫైర్

Andhra
Advertisement
  • వైసీపీ నేతలు అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారన్న బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి
  • మహిళ ఆత్మహత్య ఘటనను స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శ
  • ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు భూమన కరుణాకర్ రెడ్డి యత్నిస్తున్నారని వ్యాఖ్య
వైసీపీ నేతలు అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారని, నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఇటీవల చోటుచేసుకున్న గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య ఘటనను స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడం అత్యంత హేయమైన చర్య అని విమర్శించారు. క్షేత్రస్థాయి వాస్తవాలను పూర్తిగా విస్మరించి.. ప్రభుత్వం, సంబంధిత అధికార వ్యవస్థలపై ఉద్దేశపూర్వకంగా బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ సున్నితమైన అంశంపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని భాను ప్రకాశ్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజల్లో అనవసర అపోహలు, అయోమయం సృష్టించేందుకే ఇటువంటి ఆరోపణలు తెరపైకి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. దురదృష్టకర ఘటనలను కూడా రాజకీయ లబ్ధి కోసం మలచుకోవడం సరికాదని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు.
Advertisement

సంబంధిత వార్తలు

Bhanu Prakash ReddyBJP Andhra PradeshBhumana Karunakar ReddyYSRCPWoman Suicide Politics

More Telugu News

‘‘ఆట హాస్యాస్పదంగా మారింది’’.. వైభవ్‌ రికార్డుపై మంజ్రేకర్‌ సంచలన వ్యాఖ్యలు

25 Nov, 17:07

ఆంజనేయస్వామి గుడి తరలింపు అలైన్‌మెంట్ వైసీపీ హయాంలోనే జరిగింది: గద్దె రామ్మోహన్ రావు

25 Nov, 17:02

నా పిలుపుతో 50 శాతం మంది విద్యావంతులు పోటీలో నిలిచారు: జేసీ ప్రభాకర్ రెడ్డి

25 Nov, 16:47

మార్కెట్లకు లాభాల పంట.. 1500 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్.. 25,800 దాటిన నిఫ్టీ

25 Nov, 16:44

వృద్ధాప్యానికి ఏఐతో చెక్.. మనిషి 1400 ఏళ్లు బతకడం సాధ్యమేనా?

25 Nov, 16:40

మైటీడీపీ’ సభ్యుల సంఖ్య 10 లక్షలకు చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉంది: నారా లోకేశ్

25 Nov, 16:29

కీబోర్డులో అన్ని బటన్లు చిన్నవిగా ఉంటే.. స్పేస్‌బార్ మాత్రమే పొడవుగా ఎందుకుంటుందో తెలుసా?

25 Nov, 16:21

డాలర్‌పై రూపాయి జోరు.. 8 నెలల గరిష్ఠానికి మారకం విలువ.. ఈ ఆర్థిక సంవత్సర నష్టాలన్నీ కవర్!

25 Nov, 16:18

నాడు ఎన్డీయేలోకి వచ్చి ఉంటే ఆయన రాష్ట్రపతి అయ్యేవారు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

25 Nov, 16:13

నయనతార అనుకుంటే పొరపాటే.. నెట్టింట వైరల్ అవుతున్న ఈమె ఎవరో తెలుసా?

25 Nov, 16:10

నారా లోకేశ్ నాయకత్వంలో సరికొత్త చరిత్ర.. 10 లక్షల మందితో ‘మైటీడీపీ’ అతిపెద్ద మైలురాయి

25 Nov, 15:57

'డ్రోన్స్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

25 Nov, 15:44

రోడ్డు అలైన్‌మెంట్ మార్చే వీలున్నా ఆలయాన్ని ఎందుకు కూల్చారు?: వెల్లంపల్లి ధ్వజం

25 Nov, 15:38

వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్: ఇకపై మెసేజ్‌లు షెడ్యూల్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసుకోండి!

25 Nov, 15:34
..More Telugu News