నారా లోకేశ్ నాయకత్వంలో సరికొత్త చరిత్ర.. 10 లక్షల మందితో ‘మైటీడీపీ’ అతిపెద్ద మైలురాయి
Advertisement
- మైటీడీపీ యాప్‌లో నమోదైన కార్యకర్తల సంఖ్య పది లక్షలకు చేరిక
- పార్టీతో కార్యకర్తలను నేరుగా అనుసంధానించేందుకు సరికొత్త సాంకేతికత
- క్షేత్రస్థాయిలో కష్టపడే శ్రేణులకు గుర్తింపునిచ్చేలా నారా లోకేశ్ సూచనలతో ప్రత్యేక వ్యవస్థ
- అభిప్రాయ సేకరణతో పాటు పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణకు డిజిటల్ వేదిక
- నరసరావుపేట, కుప్పం సహా పలు నియోజకవర్గాల్లో యాప్ వినియోగం ముందంజ
రాజకీయాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో భాగంగా తెలుగుదేశం పార్టీ మరో ముందడుగు వేసింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ ఆలోచనతో, పార్టీ కార్యకర్తలను అధిష్ఠానంతో అనుసంధానించే లక్ష్యంతో రూపొందించిన ‘మైటీడీపీ’ (MyTDP) యాప్‌లో నమోదైన వారి సంఖ్య 10 లక్షల మైలురాయిని అధిగమించింది. ఈ మేరకు టీడీపీ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. దేశంలోని ప్రాంతీయ పార్టీల డిజిటల్ నిర్వహణలో ఇది ఒక ప్రత్యేక మైలురాయిగా నిలిచిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
నారా లోకేశ్ విజన్ కు అనుగుణంగా ఈ డిజిటల్ వేదికను అభివృద్ధి చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసే సాధారణ కార్యకర్తలను గుర్తించి, వారి సేవలకు తగిన అవకాశాలు కల్పించడమే ఈ వ్యవస్థ ప్రధాన ఉద్దేశమని పార్టీ తెలిపింది. గ్రామాల్లో, వార్డుల్లో పార్టీ కార్యక్రమాలు, ఇంటింటి ప్రచారం, సేవా కార్యక్రమాలు నిర్వహించే కార్యకర్తలు తమ వివరాలను ఎప్పటికప్పుడు ఈ యాప్‌లో నమోదు చేసుకునే వీలు కల్పించారు. దీని ద్వారా కార్యకర్తల పనితీరును నేరుగా పరిశీలించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు, పార్టీ పదవులు మరియు నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తున్నట్లు పార్టీ స్పష్టం చేసింది.
ఈ యాప్ ద్వారా అధినేత సందేశాలు, పార్టీ మార్గదర్శకాలు త్వరితగతిన శ్రేణులకు చేరుతున్నాయి. అదే సమయంలో క్షేత్రస్థాయి సమస్యలు, కార్యకర్తల అభిప్రాయాలను నాయకత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఇది ఉపయోగపడుతోంది. ఇటీవల నిర్వహించిన డిజిటల్ మహానాడుతో పాటు శిక్షణా తరగతులు, ఇతర సమావేశాల హాజరును కూడా ఈ వ్యవస్థ ద్వారానే పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా, పార్టీ నాయకులతో కార్యకర్తలు దిగిన ఫొటోలను సులభంగా పొందేందుకు వీలుగా ‘ఫొటో బూత్’ పేరిట ఫేస్ రికగ్నిషన్ సదుపాయాన్ని కూడా ఇందులో పొందుపరిచారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ యాప్ వినియోగంలో పార్లమెంట్ విభాగంలో నరసరావుపేట, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు నియోజకవర్గాలు ముందంజలో ఉండగా.. అసెంబ్లీ విభాగంలో కుప్పం, వినుకొండ, కనిగిరి, మంగళగిరి, గన్నవరం నియోజకవర్గాలు అగ్రస్థానంలో నిలిచాయని పార్టీ ప్రకటన వివరించింది. ఆధునిక కాలంలో రాజకీయ వ్యవస్థను సాంకేతికతతో జోడించి, కార్యకర్తలే కేంద్రంగా పార్టీ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ డిజిటల్ వేదిక ఒక కీలక సాధనంగా మారిందని తెలుగుదేశం పార్టీ పేర్కొంది.