నిర్మల్‌లో కుమార్తె పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షల నగదు, బంగారం అగ్నికి ఆహుతి

Telangana
Advertisement
  • నిర్మల్ జిల్లా బాసర రవీంద్రపూర్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం
  • కూతురి పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షల నగదు దగ్ధం
  • మంటల్లో కాలి బూడిదైన నాలుగు తులాల బంగారం
  • షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణ
  • మంటలను అదుపులోకి తీసుకొచ్చిన ఫైర్ సిబ్బంది
ఆడబిడ్డ పెళ్లి చేసి అత్తారింటికి పంపాలని ఆ పేద తల్లిదండ్రులు కలలు కన్నారు. రూపాయి రూపాయి కూడబెట్టి దాచుకున్న సొమ్ము, చేయించిన బంగారు నగలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఒక్క ప్రమాదం ఆ కుటుంబం కళ్లముందే వాళ్ల స్వప్నాలను బూడిద చేసింది. షార్ట్ సర్క్యూట్ రూపంలో వచ్చిన మంటలు ఆ పేదింటి భవిష్యత్తును అగ్నికి ఆహుతి చేశాయి.

నిర్మల్ జిల్లా బాసర పరిధిలోని రవీంద్రపూర్ కాలనీలో షేక్ ఇబ్రహీం నివాసంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. క్షణాల వ్యవధిలోనే మంటలు ఇల్లంతా వ్యాపించి తీవ్ర ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి.

కూతురి పెళ్లి కోసం ఇబ్రహీం కుటుంబం ఎంతో కష్టపడి దాచిన దాదాపు రూ.10 లక్షల నగదు, నాలుగు తులాల బంగారం ఈ ప్రమాదంలో పూర్తిగా కాలి బూడిదయ్యాయి.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Advertisement

సంబంధిత వార్తలు

Shaik IbrahimNirmal fire accidentBasar short circuit newsDaughter wedding savings fireTelangana local newsFire accident property loss

More Telugu News

కెన్యాలో క్రికెట్ సందడి.. 'సూపర్ 90' బరిలో దిగ్గజాలు

25 Nov, 12:28

వారాల నిరసనల తర్వాత గార్మెంట్ కార్మికుల కనీస వేతనాన్ని 36% పెంచిన బంగ్లాదేశ్

25 Nov, 12:26

తిరుమల కొండపై భారీ వర్షం.. ఘాట్ రోడ్లపై భారీగా పడిపోయిన విజిబిలిటీ

25 Nov, 12:24

ఏఐ కంట్రోల్ తప్పితే ఆపడం ఎవరి వల్లా కాదు.. ఓపెన్‌ఏఐ మాజీ డైరెక్టర్ హెలెన్ టోనర్ సంచలన వార్నింగ్!

25 Nov, 12:17

రికార్డు స్థాయికి పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. గజగజ వణుకుతున్న జమ్మూకశ్మీర్

25 Nov, 12:11

కిషన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం.. పాల్గొన్న సినీ నటుడు వెంకటేశ్

25 Nov, 11:41

మ్యాచ్‌కు ముందు యువీ ఇచ్చిన ఆ ఒక్క మంత్రంతో వైభవ్‌ ఊచకోత!

25 Nov, 11:40

పసిడి ప్రియులకు పండగ.. భారీగా పతనమైన బంగారం.. వెండి కూడా డౌన్!

25 Nov, 11:23

కనుమూరు ఫారెస్ట్‌లో ఐదో రోజూ కొనసాగుతున్న పులి గాలింపు.. అందని జీపీఎస్ సిగ్నల్

25 Nov, 11:22

పాతికేళ్లకే బట్టతల భయం ఎందుకు? మీ శరీరంలో దాగున్న అసలు సమస్యలు ఇవే!

25 Nov, 11:10

మహాకాళుడి సేవలో భారత క్రికెటర్లు.. భస్మ హారతిలో పాల్గొన్న చాహల్, రాణా

25 Nov, 11:08

'మిస్ యూనివర్స్' విజేతగా ప్యూర్టోరికో సుందరి జెన్నిఫర్ బారెటో.. తల్లిగా కిరీటం గెలుచుకుని చరిత్ర

25 Nov, 11:07

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను పట్టించుకోకపోతే కొంపకొల్లేరే.. కంపెనీలకు సిస్కో సీఈవో చక్ రాబిన్స్ హై అలర్ట్!

25 Nov, 10:55

బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేది లేదు.. వివాదాలకు దూరంగా ఉంటా: కాశ్వి హీరానందానీ

25 Nov, 10:53
..More Telugu News