వైభవ్ విశ్వరూపం: 52 బంతుల్లో డబుల్ సెంచరీ.. 28 సిక్సర్లతో సునామీ.. ప్రపంచ రికార్డులన్నీ గల్లంతు!
Advertisement
- 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాది రికార్డు సృష్టించిన వైభవ్
- చాడ్ బోవ్స్ (103 బంతులు) పేరిట ఉన్న వరల్డ్ రికార్డ్ గల్లంతు
- ఒకే ఇన్నింగ్స్‌లో 28 సిక్సర్లు బాది ప్రొఫెషనల్ క్రికెట్ హిస్టరీలోనే టాప్
- 28 బాల్స్‌కు శతకం, 40 బాల్స్‌కు 150 రన్స్, 52 బాల్స్‌కు 200 పూర్తి
- 14.2 ఓవర్లలోనే యూఏఈపై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం
ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని సరికొత్త విధ్వంసం నమోదైంది. భారత టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బంతిని బాదుడే బాదుడు అన్నట్లుగా విరుచుకుపడుతూ పలు అంతర్జాతీయ, దేశవాళీ రికార్డులను తుడిచిపెట్టేశాడు. కేవలం 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ (ద్విశతకం) బాది ప్రపంచ వన్డే క్రికెట్‌ను నివ్వెరపరిచాడు. లిస్ట్-ఏ వన్డే చరిత్రలోనే అత్యంత వేగవంతమైన ద్విశతకంగా ఇది చరిత్రకెక్కింది. అంతకుముందు చాడ్ బోవ్స్ 103 బంతుల్లో నెలకొల్పిన ప్రపంచ రికార్డును సూర్యవంశీ సగానికి సగం బంతుల్లోనే బద్దలు కొట్టడం గమనార్హం. గతంలో ఎన్ జగదీశన్ (114 బంతులు), హ్యారీ బ్రూక్ (114 బంతులు) పేరిట ఉన్న రికార్డులన్నీ ఈ సునామీ ధాటికి కొట్టుకుపోయాయి.
దోహా వేదికగా యూఏఈతో జరిగిన ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 గ్రూప్-బి పోరులో వైభవ్ బ్యాటింగ్‌కు ప్రత్యర్థి బౌలర్లు బెంబేలెత్తిపోయారు. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే సిక్సర్ల వర్షం కురిపించిన సూర్యవంశీ.. ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 28 సిక్సర్లు బాది యావత్ ప్రొఫెషనల్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్ల ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డును లిఖించాడు. 2024 రంజీ ట్రోఫీలో హైదరాబాద్ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ కొట్టిన 26 సిక్సర్ల రికార్డును అతడు అధిగమించాడు. న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ కొలిన్ మన్రో (23 సిక్సర్లు), ఆస్ట్రేలియా ప్లేయర్ డార్సీ షార్ట్ (23 సిక్సర్లు) సాధించిన మైలురాళ్లను కూడా వైభవ్ సునాయాసంగా దాటేశాడు.
వైభవ్ ఆడిన ఈ నమ్మశక్యం కాని ఇన్నింగ్స్‌లో మొదట కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత సునామీలా విరుచుకుపడుతూ 28 బంతుల్లో సెంచరీ కొట్టి లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలు కొట్టాడు. ఆ తర్వాత 40 బంతుల్లో 150 మార్కును అందుకున్నాడు. ఇది కూడా ఓ రికార్డే. అక్కడితో ఏమాత్రం ఆగకుండా అదే జోరు కొనసాగిస్తూ 52 బంతుల్లోనే 200 పరుగుల మార్కును దాటి రికార్డులను తిరగరాశాడు. లిస్ట్-ఏ చరిత్రలో వేగవంతమైన సెంచరీ, ఫాస్టెస్ట్ 150, అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ.. ఇలా అన్ని రికార్డులనూ ఒకే మ్యాచ్‌లో కొల్లగొట్టిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు. వైభవ్ ధాటికి ఇండియా-ఏ కేవలం 5 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసుకుని సరికొత్త జట్టు రికార్డును సైతం నమోదు చేసింది.
మ్యాచ్ వన్ సైడెడ్ ఇలా అయింది!
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఆరంభంలోనే హర్షిత్ రాణా, అర్షద్ ఖాన్ చెలరేగడంతో 20 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ యూఏఈని మాజీ భారత దేశవాళీ బ్యాటర్ హర్‌ప్రీత్ సింగ్ భాటియా అద్భుత శతకంతో ఆదుకున్నాడు. హర్‌ప్రీత్ 144 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 130 పరుగులు సాధించి జట్టుకు భారీ స్కోరు అందించగా.. మహ్మద్ షహదాద్ (28), ఏతాన్ డిసౌజా (25), చివర్లో కెప్టెన్ బాసిల్ హమీద్ (నాటౌట్ 36) అతడికి విలువైన సహకారం అందించారు. భారత బౌలర్లలో అర్షద్ ఖాన్ 10 ఓవర్లలో 43 పరుగులిచ్చి 4 వికెట్లతో సత్తా చాటగా.. హర్షిత్ రాణా, సూర్యాంశ్ షెడ్గే, హర్ష్ దూబే, షాబాజ్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారత బ్యాటర్లలో వైభవ్ 53 బంతుల్లో 204 పరుగులు చేసి ఔటయ్యాడు. ఛేదించాల్సిన లక్ష్యాన్ని దాదాపు ఒక్కడే పూర్తి చేశాడు. అభిషేక్ శర్మ (12), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (3) తక్కువ పరుగులకే వెనుదిగిరారు. రింకూ సింగ్ 27, కుమార్ కుషాగ్ర 1 నాటౌట్‌గా నిలిచి 14.2 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించారు.