భారత్‌తో యుద్ధంలో పాక్‌కు చైనా అండ.. అమెరికా నివేదికలో కీలక విషయాలు!

International
Advertisement
  • అమెరికా కాంగ్రెస్ కమిషన్ నివేదికలో కీలక అంశాలు వెల్లడి
  • భారత్ ఎదుగుదలను అడ్డుకోవడమే చైనా లక్ష్యమని స్పష్టం
  • 'ఆపరేషన్ సిందూర్'లో పాక్‌కు అయుధాలు, సాంకేతిక సహకారం
  • భారత్-అమెరికా నిఘా సహకారం పెంచాలని కమిషన్ సిఫార్సు
భారత్‌తో తలెత్తిన సైనిక ఘర్షణల సమయంలో పాకిస్థాన్‌కు చైనా సైనిక సహకారం అందించినట్లు అమెరికా కాంగ్రెస్‌కు చెందిన కీలక కమిషన్ తన నివేదికలో వెల్లడించింది. ఆర్థిక, సైనిక, సముద్ర రంగాల్లో భారత్ ఎదుగుదలను అడ్డుకునే విస్తృత వ్యూహంలో భాగంగానే చైనా ఈ చర్యలకు పాల్పడిందని సదరు కమిషన్ పేర్కొంది.

యూఎస్-చైనా ఎకనమిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ విడుదల చేసిన తాజా వార్షిక నివేదిక ఈ సంచలన అంశాలను బహిర్గతం చేసింది. 2025 ఏప్రిల్‌లో జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో చోటుచేసుకున్న ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' చేపట్టిందని, మే 2025లో పాకిస్థాన్‌తో జరిగిన పోరులో ఇస్లామాబాద్ చైనా నుంచి పొందిన అత్యాధునిక ఆయుధాలను వినియోగించినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది.

ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో చైనా ఇంజినీర్లు పాకిస్థాన్‌లోనే ఉండి, చైనా తయారీ యుద్ధ విమానాలకు ప్రత్యక్ష సాంకేతిక సహకారాన్ని అందించినట్లు నివేదిక ఉటంకించింది. పాకిస్థాన్‌కు చైనా శాటిలైట్ చిత్రాలతో పాటు ఇతర నిఘా సమాచారాన్ని కూడా చేరవేసి ఉండవచ్చని భారత సైనిక అధికారులు అనుమానిస్తున్నట్లు పేర్కొంది. ఉద్రిక్తతలు గరిష్ఠ స్థాయికి చేరిన వేళ, భారత జలాల సమీపంలో చైనా ఒక నిఘా నౌకను మోహరించిన విషయాన్ని కూడా నివేదిక వెల్లడించింది.

భారత్‌పై ద్విముఖ వ్యూహంతో ఒత్తిడి పెంచేందుకు పాకిస్థాన్‌ను చైనా పావుగా వాడుకుంటోందని కమిషన్ విశ్లేషించింది. చైనా చర్యలకు దీటుగా భారత్ సైతం తన సైనిక ఆధునికీకరణను వేగవంతం చేసిందని పేర్కొంది. ఈ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా భారత్-అమెరికా మధ్య నిఘా సమాచార మార్పిడి, సముద్ర భద్రత వంటి కీలక రంగాల్లో సహకారాన్ని మరింత పటిష్ఠం చేసుకోవాలని కమిషన్ సిఫార్సు చేసింది.
Advertisement

సంబంధిత వార్తలు

ChinaPakistanIndiaUS Commission ReportOperation SindoorMilitary Intelligence

More Telugu News

సేవలోనూ ఒక్కటైన టేలర్ స్విఫ్ట్, ట్రావిస్ కెల్సీ.. 20 సంస్థలకు రూ. 241 కోట్ల భారీ విరాళం!

24 Nov, 10:41

యాప్స్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా? ఆర్బీఐ కొత్త నిబంధనలు.. అధిక ఛార్జీలకు చెక్

24 Nov, 10:20

అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు రెండు కీలక సమావేశాలు

24 Nov, 10:10

ప్రపంచాన్ని కదిలించిన పెలికోట్‌కు మరో షాక్.. దిగ్భ్రాంతికి గురయ్యానన్న బాధితురాలు

24 Nov, 10:08

ఇండోనేసియా క్యాండీ ఫ్యాక్టరీ ప్రమాదంలో 24 మంది మృతి

24 Nov, 10:06

గ్రౌండ్‌లో బుమ్రా ఫన్నీ రియాక్షన్: 'ఎలా పట్టాలిరా బాబూ?'.. వైరల్ అవుతున్న వీడియో!

24 Nov, 09:58

బౌలర్‌పై గిల్‌ అలా అరవడం సరికాదు.. కెప్టెన్ ప్రవర్తనను తప్పుబట్టిన రహానే

24 Nov, 09:46

మరణశిక్ష ఉన్నా వెనక్కి తగ్గేది లేదు.. బంగ్లాదేశ్‌కు రాకపై హసీనా కీలక ప్రకటన

24 Nov, 09:49

చేతిలో లోదుస్తులు, ఒంటిపై రక్తం.. ట్రంప్ షేర్ చేసిన ఎన్విడియా బాస్‌ ఫొటో వెనుక కథేంటి?

24 Nov, 09:29

ఇంటర్ అర్హతతో డిఫెన్స్ కొలువులకు యూపీఎస్‌సీ ఆహ్వానం.. ఎన్‌డీఏ 2027 నోటిఫికేషన్ విడుదల!

24 Nov, 09:26

హిజాబ్ లేకుండా సంగీత ప్రదర్శన.. ఇరాన్ సింగర్, ఆమె బృందానికి కొరడా దెబ్బలు

24 Nov, 09:24

హైదరాబాద్‌లో ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ సందడి: రోడ్డుపై బజ్జీలు, హోటల్లో బన్ మస్కా తింటూ హల్‌చల్!

24 Nov, 09:22

కార్తిక పౌర్ణమి.. శివనామస్మరణతో మార్మోగుతున్న తెలుగు రాష్ట్రాలు

24 Nov, 09:01

'రామాయణ' వసూళ్ల సునామీ.. 19 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1,700 కోట్లు దాటిన కలెక్షన్లు

24 Nov, 08:57
..More Telugu News