24 ఏళ్ల యువతికి టీడీపీ బంపరాఫర్.. ఏకంగా డిప్యూటీ మేయర్ పీఠం దక్కించుకున్న చర్పిత!
Advertisement
- ఒంగోలు డిప్యూటీ మేయర్‌గా చావలి చర్పిత బాధ్యతలు
- ఒంగోలు కార్పొరేషన్ పగ్గాలు చేపట్టిన శ్రీశిల్ప, చర్పిత ద్వయం
- చర్పిత ఎస్ఆర్ఎం నుంచి ఎంటెక్ పూర్తి చేసి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ
- కార్పొరేట్ కొలువులు కాదని ప్రజాసేవను ఎంచుకున్న యువతి
- ఎన్నికల వేళ రీల్స్, సోషల్ మీడియా వీడియోలతో యువతకు కనెక్ట్
ఒకప్పుడు రాజకీయాలు అంటే తలపండిన సీనియర్లు, దశాబ్దాల అనుభవం ఉన్నవారికే పరిమితమనే భావన ఉండేది. ఆ పాత సాంప్రదాయాలకు తెరదించుతూ నేటి తరం యువత ప్రత్యక్ష ఎన్నికల్లోకి దూసుకొస్తోంది. కేవలం ఓట్లు సాధించి పదవులు దక్కించుకోవడమే కాకుండా, నగరాల అభివృద్ధిని నిర్దేశించే కీలక పాలనా పగ్గాలు చేపడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు నగర పాలక సంస్థలో చోటుచేసుకున్న తాజా పరిణామం ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. కార్పొరేటర్‌గా గెలిచిన కొన్ని రోజుల్లోనే అత్యంత పిన్న వయసులో డిప్యూటీ మేయర్ కుర్చీని కైవసం చేసుకుని చావలి చర్పిత వార్తల్లో నిలిచారు.
ఒంగోలు నగర పాలనలో ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. నగర మేయర్‌గా శ్రీశిల్ప, డిప్యూటీ మేయర్‌గా చర్పిత బాధ్యతలు స్వీకరించడంతో పాలనా పగ్గాలు పూర్తిగా మహిళల చేతుల్లోకి వెళ్లాయి. ఇందులో ముఖ్యంగా 24 ఏళ్లకే డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన చర్పిత గురించే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది. నెటిజన్లు, యువత ఆమెకు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.
చర్పిత ఎన్నికల ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా సాగింది. టీడీపీ అభ్యర్థిగా 27వ డివిజన్ బరిలోకి దిగిన ఆమె, ప్రచారంలో వినూత్న శైలితో ప్రజల మనసులు గెలుచుకున్నారు. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా రీల్స్, ప్రచార వీడియోలను ఉపయోగిస్తూ యువతను విశేషంగా ఆకట్టుకున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను చిరునవ్వుతో పలకరిస్తూ ఆత్మీయత చూపించిన ఆమె ప్రచార వీడియోలు నెట్టింట విపరీతంగా చక్కర్లు కొట్టాయి. ప్రత్యర్థి పార్టీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై తిరుగులేని విజయం సాధించి కౌన్సిల్ హాల్‌లో అడుగుపెట్టారు.
ప్రఖ్యాత ఎస్ఆర్ఎం ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎంటెక్ పూర్తి చేసిన చర్పిత.. కార్పొరేట్ రంగంలో ఉన్నత ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ సమాజ సేవ వైపే మొగ్గు చూపారు. ఆమె కుటుంబానికి టీడీపీతో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం ఉంది. తండ్రి మున్సిపల్ కాంట్రాక్టర్‌గా, తాత చావలి కృష్ణయ్య గతంలో కౌన్సిలర్‌గా ప్రజలకు సేవలందించారు. అమ్మమ్మ అనంతమ్మ ప్రస్తుతం అన్నవరం దేవస్థానం బోర్డు డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. గెలిచిన వెంటనే ఓటర్ల వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపిన చర్పిత.. ఇప్పుడు యువ నాయకత్వ ప్రతిభను పరిపాలనలో నిరూపించాల్సిన కీలక బాధ్యతను భుజానికెత్తుకున్నారు.