భక్తితో వెళ్లి ఇరుక్కుపోయి తంటాలు పడిన వ్యక్తి.. వీడియో వైరల్!
Advertisement
- మధ్యప్రదేశ్‌లోని నర్మదా ఆలయంలో వింత ఘటన
- ఏనుగు విగ్రహం కింద దూరేందుకు యత్నించి ఇరుక్కుపోయిన భక్తుడు
- కోరికలు తీరతాయనే నమ్మకంతో మొక్కు చెల్లింపు
- గంటల తరబడి శ్రమించి వ్యక్తిని బయటకు తీసిన స్థానికులు
మధ్యప్రదేశ్‌లోని ఓ ఆలయంలో వింత ఘటన చోటుచేసుకుంది. మొక్కు చెల్లించుకునేందుకు ప్రయత్నించిన ఓ భక్తుడు, ఏనుగు విగ్రహం కింద ఇరుక్కుపోయి గంటలపాటు నరకయాతన అనుభవించాడు. అమర్‌కంఠక్‌లోని ప్రసిద్ధ మా నర్మదా ఆలయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే..!
ఈ ఆలయంలోని ఏనుగు విగ్రహం కింద నుంచి వెళితే కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. ఈ ఆచారంలో భాగంగానే ఓ వ్యక్తి విగ్రహం కింద ఉన్న ఇరుకైన ప్రదేశంలో నుంచి దూరేందుకు ప్రయత్నించాడు. అయితే, మధ్యలోకి వెళ్లాక ముందుకు, వెనక్కి కదలలేక అందులోనే ఇరుక్కుపోయాడు.
అతను బయటకు రాలేక ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన తోటి భక్తులు, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఎలా కదలాలో, శరీరాన్ని ఏ వైపు తిప్పాలో సూచనలు ఇస్తూ అతడిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. గంటల తరబడి శ్రమించిన తర్వాత, అందరి సహాయంతో ఆ వ్యక్తి ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డాడు. గతంలోనూ కొందరు భక్తులు ఇలాగే విగ్రహం కింద ఇరుక్కుపోయిన సందర్భాలు ఉన్నాయని స్థానికులు తెలిపారు.