మారుతి కంపెనీలో సోనియాకు 50 శాతం వాటా: బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన పోస్ట్!

National
Advertisement
  • విదేశీ పౌరురాలైనప్పటికీ మారుతి సంస్థలో 50 శాతం వాటా ఉన్నట్లు వ్యాఖ్య
  • 1970లో సోనియా సంస్థ డైరెక్టర్‌గా ఎలా అయ్యారని ప్రశ్న
  • హర్యానాలో విదేశీ పౌరురాలికి భూమి ఎలా కేటాయించారంటూ ఎక్స్‌లో పోస్ట్‌
  • ప్రధాని కార్యాలయంలో ప్రైవేట్ కంపెనీ ఆఫీస్ ఎలా తెరిచారని నిలదీత
  • సొంత డబ్బు పెట్టకుండానే కంపెనీ ఎలా కట్టారో పుస్తకంలో రాయాలంటూ సెటైర్
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ లక్ష్యంగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేశారు. విదేశీ పౌరురాలై ఉండి కూడా ఆమెకు ఓ భారతీయ కంపెనీలో భారీగా వాటాలున్నాయని, ఆమె పేరిట భూమి కేటాయింపులు కూడా జరిగాయని పేర్కొన్నారు. శనివారం 'ఎక్స్' వేదికగా "కాంగ్రెస్ చీకటి అధ్యాయం - చాప్టర్ 250" పేరుతో ఆయన ఓ సుదీర్ఘ పోస్ట్‌ చేశారు. విదేశీ పౌరురాలైనప్పటికీ సోనియా గాంధీ 'మారుతి టెక్నికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్' సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారని, ఆ సంస్థలో ఆమెకు 50 శాతం వాటా ఉందని ఆరోపించారు.

1970 నవంబర్ 21న సోనియా గాంధీకి చెందిన 'మారుతి టెక్నికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్'తో సంజయ్ గాంధీ ఒప్పందం కుదుర్చుకున్నారని దూబే తెలిపారు. మారుతి సంస్థకు అసలైన యజమాని సోనియా గాంధీనే అని వ్యాఖ్యానించారు. మారుతి 1970లో ఏర్పాటవగా, కార్ల తయారీకి సంబంధించిన లేఖ 1968లోనే ప్రభుత్వానికి చేరిందన్నారు. 1969లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తన కోడలు సోనియా నేతృత్వంలోని కంపెనీ కార్లు తయారు చేసేందుకు కేబినెట్ ఉత్తర్వులు ఇప్పించారా? అని నిలదీశారు. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక విదేశీయుడు భారతీయ సంస్థలో డైరెక్టర్ కాలేరని, మరి 1970లో సోనియా ఎలా డైరెక్టర్ అయ్యారని ప్రశ్నించారు.

అప్పట్లో హర్యానా ప్రభుత్వ నిబంధనల ప్రకారం విదేశీయులకు భూమి కేటాయించే అవకాశం లేనప్పుడు సోనియా పేరిట భూమి ఎలా కేటాయించారని దూబే ప్రశ్నించారు. ప్రధానమంత్రి కార్యాలయంలో ఒక ప్రైవేట్ కంపెనీ కార్యాలయం ఎలా తెరిచారని, ప్రధాని ప్రైవేట్ సెక్రటరీ ధావన్ దానికి డైరెక్టర్ ఎలా అయ్యారని నిలదీశారు. ఎలాంటి సొంత పెట్టుబడి పెట్టకుండానే ఇంత పెద్ద కంపెనీని ఎలా నిర్మించారో సోనియా గాంధీ తన తాజా పుస్తకంలో వివరిస్తే బాగుండేదని ఎద్దేవా చేశారు. ఈ వ్యవహారాలపై 1979 నాటి జస్టిస్ ఏసీ గుప్తా కమిషన్ విచారణ నివేదికను ఉటంకిస్తూ, 1973 నుంచి 1975 మధ్య సంస్థలో సోనియా పాత్ర, ఆమె రాజీనామా వివరాలను కూడా నిషికాంత్ దూబే ప్రస్తావించారు.
Advertisement

సంబంధిత వార్తలు

Sonia GandhiNishikant DubeyMaruti Technical ServicesBJP allegationsMaruti sharesSanjay Gandhi

More Telugu News

ఐసీఎంఆర్ ఉద్యోగ ప్రకటన.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

21 Nov, 15:47

పెదనాన్న సినిమాకు అరుదైన గౌరవం.. భావోద్వేగానికి గురైన ప్రభాస్

21 Nov, 15:44

రైల్వే కోడూరులో బాలికలపై ఈవ్ టీజింగ్.. నారా లోకేశ్ స్పందనతో అప్రమత్తమైన పోలీసులు

21 Nov, 15:35

డబ్ల్యూటీసీలో సరికొత్త చరిత్ర: 3000 పరుగులతో గిల్ సరికొత్త రికార్డు.. వెంటే పంత్!

21 Nov, 15:28

కొత్త ఎయిర్‌లైన్స్‌కు భోగాపురం కేంద్రస్థానం కావాలి: రామ్మోహన్ నాయుడు

21 Nov, 15:20

ఐఐటీ ఖరగ్‌పూర్‌కు గూగుల్ రూ.46 కోట్ల భారీ సాయం

21 Nov, 15:16

ఆటోలో మర్చిపోయిన రూ.4 లక్షల బంగారు నగలు పోలీసులకు అప్పగించిన డ్రైవర్

21 Nov, 15:14

పల్లెటూరి వంట.. ప్రపంచాన్ని చుట్టేసింది.. 3 కోట్ల ఫాలోవర్లు క‌లిగిన‌ విలేజ్ కుకింగ్ ఛానెల్ సక్సెస్ స్టోరీ!

21 Nov, 15:04

రాజమండ్రి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి: ఎంపీ పురందేశ్వరి

21 Nov, 15:00

వైఎస్ తో ఈ సమస్య రాలేదు.. పెళ్లికి ఆహ్వానిస్తే ఇంత నీచపు రాతలు అవసరమా?: చంద్రబాబు

21 Nov, 14:58

167 ఏళ్లుగా నిపుణులను ఇబ్బంది పెట్టిన గణిత పజిల్.. క్లాడ్ ఏఐ ఛేదించిందా?

21 Nov, 14:46

సెంట్రల్ కాంట్రాక్టుల ప్రకటన.. కీల‌క ప్లేయ‌ర్ల‌కు షాకిచ్చిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు!

21 Nov, 14:42

ఉద్యోగులకు బంగారు ఉంగరాలు.. పెళ్లి వేళ కావ్య మారన్ అదిరిపోయే గిఫ్ట్!

21 Nov, 14:37

నేటి సాయంత్రం 5 గంటలకు భారీ ప్రకటన ఉంటుంది.. అదేంటో చెప్పగలరా?: నారా లోకేశ్

21 Nov, 14:24
..More Telugu News