గెలిచిందెవరు, ఓడిందెవరు? రాష్ట్ర ప్రజలకు విజయసాయిరెడ్డి క్విజ్
Advertisement
- స్థానిక సంస్థల ఎన్నికలపై సోషల్ మీడియాలో స్పందించిన విజయసాయిరెడ్డి
- రాష్ట్రంలో గెలిచింది ఎవరు ఓడింది ఎవరు అంటూ ప్రజలకు క్విజ్
- నెటిజన్ల అభిప్రాయం కోసం నాలుగు ఆప్షన్లతో పోల్ నిర్వహణ
- పరివర్తన రాజనీతి పార్టీ అధినేత పోస్టుపై రాజకీయ వర్గాల్లో చర్చ
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల పరిణామాలపై మాజీ ఎంపీ, పరివర్తన రాజనీతి పార్టీ అధినేత విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఎన్నికల్లో గెలుపోటములపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే ఉద్దేశంతో ఆయన తనదైన శైలిలో ఒక పోల్ నిర్వహించారు. ఈ మేరకు నెటిజన్ల కోసం ఒక క్విజ్ పోస్ట్ చేశారు.
"నా ప్రియమైన రాష్ట్ర ప్రజలారా.. మీకు ఒక క్విజ్! రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో గెలిచిందెవరు? ఓడిందెవరు? ఈ క్రింద ఇచ్చిన నాలుగు ఆప్షన్స్ లో మీ ఓటు ఎవరికి వేస్తారో దయచేసి దానిపైన క్లిక్ చేయండి" అని విజయసాయిరెడ్డి తన పోస్టులో పేర్కొన్నారు.
ఈ క్విజ్ కోసం ఆయన నాలుగు ఆప్షన్లను ఇచ్చారు. అందులో మొదటి ఆప్షన్‌గా 'రెడ్ బుక్ పార్టీనా', రెండో ఆప్షన్‌గా 'రప్పా రప్పా పార్టీనా', మూడో ఆప్షన్‌గా 'ఎన్నికల కమిషన్-పోలీసులా', నాల్గవ ఆప్షన్‌గా 'ప్రజలు-ప్రజాస్వామ్యమా' అని పేర్కొంటూ నెటిజన్ల అభిప్రాయాలను కోరారు.