ఫాంటసీ టచ్ తో సాగే ఫ్యామిలీ సిరీస్ ..'లవ్ ఆల్వేస్'

Entertainment
Advertisement
  • ఫ్యామిలీ ఆడియన్స్ కోసం 'లవ్ ఆల్వేస్'
  • ప్రధాన పాత్రలలో జయసుధ - జయప్రకాశ్
  • కీలకమైన పాత్రలో గౌరీ కిషన్
  • 8 ఎపిసోడ్స్ గా రూపొందిన సిరీస్
  • అక్టోబర్ 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్
కొన్ని రోజులుగా ఓటీటీలో ఒక సిరీస్ దూసుకుపోతోంది. లవ్ .. కామెడీ .. ఎమోషన్స్ తో పాటు ఫాంటసీ టచ్ తో సాగే ఈ సిరీస్ లో జయసుధ ప్రధానమైన పాత్రను పోషించడం విశేషం. జయసుధ కనిపించడంతో, సహజంగానే ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టి ఈ సిరీస్ వైపు తిరిగిపోయింది. ఇతర కీలకమైన పాత్రలలో జయప్రకాశ్ .. గౌరీ కిషన్ .. రంజాన్ మహ్మద్ కనిపించనున్నారు. మధుమిత దర్శకత్వం వహించిన ఈ సిరీస్, 8 ఎపిసోడ్స్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్టోబర్ 30వ తేదీ నుంచి 7 భాషల్లో 'జియో హాట్ స్టార్' ద్వారా అందుబాటులోకి వచ్చింది. 

కథ విషయానికి వస్తే .. కణ్ణన్ ( జయప్రకాశ్)  మంజుల (జయసుధ) భార్యాభర్తలు. వారి పెద్ద కొడుకు గౌతమ్ .. కోడలు రంజని. మంజుల దంపతుల మనవడు 'రఘు' .. మనవరాలు 'దీపిక'. ఉమ్మడి కుటుంబంగా అంతా కలిసి నివసిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కణ్ణన్ అనారోగ్యానికి గురవుతాడు. అయితే ఆ విషయాన్ని భార్యకి తెలియనీయడు. భార్యగా తన స్థానానికి సరైన గుర్తింపు లేకుండా పోయిందని భావించిన మంజుల, విడాకుల కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. వాళ్లిద్దరి మధ్య దూరం తగ్గించడం కోసం, కొడుకు - కోడలు కలిసి కులదేవత గుడికి తీసుకుని వెళతారు. 

అడవిని ఆనుకుని ఉన్న కులదేవత గుడి దగ్గర మనవడు రఘు కనిపించకపోవడంతో, కణ్ణన్ - మంజుల వెదుకుతూ వెళ్లి ఒక పాడుబడిన బావిలో పడిపోతారు. అది సొరంగ మార్గం కలిగిన ఒక గుహ. యవ్వనాన్ని పొందడం కోసం ఒక మాంత్రికుడు సిద్ధం చేసుకున్న గుహ అది. అక్కడి మాయాశక్తి కారణంగా కణ్ణన్ - మంజుల యవ్వనవంతులవుతారు. బయటికి వచ్చిన వాళ్లను కుటుంబ సభ్యులు గుర్తుపట్టరు. అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? ఆ తరువాత ఏమౌతుంది? అనేది కథ. 

Advertisement

సంబంధిత వార్తలు

JayasudhaLove Always Web SeriesJayaprakashGouri KishanJio HotstarFantasy Family Drama

More Telugu News

తొలి రోజే న్యూజిలాండ్ రివర్స్ ఎటాక్: బుమ్రా దెబ్బకొట్టినా నిలబడ్డ కివీస్ మిడిలార్డర్!

19 Nov, 11:54

భారత్ ఇప్పుడు సరికొత్త ఆట ఆడుతోంది: ప్రధాని నరేంద్ర మోదీ

19 Nov, 11:53

ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నగారా.. డిసెంబర్ 2న పోలింగ్, కౌంటింగ్!

19 Nov, 11:47

బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింస.. మహమ్మద్ యూనస్ ఇంటికి నిప్పు

19 Nov, 11:45

తీరం దాటేలోపే బలహీనపడనున్న తీవ్ర తుపాను 'అక్వాన్'.. ఉత్తరాంధ్రపైనే ప్రధాన ప్రభావం!

19 Nov, 11:42

నచ్చిన నంబర్ కావాలంటే ఇక స్పీడ్ పెంచాల్సిందే: తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం

19 Nov, 11:39

కాంగ్రెస్‌తో పొత్తును సీఎం విజయ్ పునఃపరిశీలించుకోవాలి: తమిళిసై సౌందరరాజన్

19 Nov, 11:37

పులివెందుల పంచాయతీ నామినేషన్లపై హైకోర్టు ఆదేశాలు... బీటెక్ రవి స్పందన

19 Nov, 10:57

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2027లో భారీ మార్పు: చరిత్రలోనే తొలిసారి!

19 Nov, 10:56

నాగోల్‌లో బైక్‌పై కూలిన చెట్టు.. పెళ్లయిన నెలకే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

19 Nov, 10:54

విశాఖ-తిరుపతి మధ్య మరో వందేభారత్.. రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్

19 Nov, 10:51

తొలి టెస్ట్: నికోల్స్ సెంచరీ... కష్టాల్లోంచి గట్టెక్కిన న్యూజిలాండ్

19 Nov, 10:40

శబరిమల యాత్రకు వచ్చే ఏపీ, తెలంగాణ భక్తులకు కేరళ ప్రభుత్వం, ఆలయ బోర్డు కీలక విన్నపం

19 Nov, 10:37

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోకి దూసుకెళ్లే యత్నం.. భగ్నం చేసిన సీఐఎస్ఎఫ్

19 Nov, 10:36
..More Telugu News