పులివెందుల పంచాయతీ నామినేషన్లపై హైకోర్టు ఆదేశాలు... బీటెక్ రవి స్పందన
Advertisement
- పులివెందులలో స్థానిక సంస్థల నామినేషన్లపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్న బీటెక్ రవి
- కోర్టును, ఎన్నికల సంఘాన్ని వైసీపీ నేతలు తప్పుదోవ పట్టించారని ఆరోపణ
- కోర్టు ఉత్తర్వులు రాకముందే పలువురు వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారని వెల్లడి
పులివెందుల నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. పులివెందులలో వైసీపీ రాజకీయ డ్రామాలకు కాలం చెల్లిందని టీడీపీ సీనియర్ నేత, పులివెందుల ఇన్‌చార్జ్ బీటెక్ రవి విమర్శించారు. వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు పులివెందులలో లేని సమస్యను సృష్టించి కోర్టులను, ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
వేంపల్లి, చక్రాయపేట మండలాల్లోని 21 పంచాయతీల్లో తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. నామినేషన్ కేంద్రాలను కడపకు మార్చాలని, పోలీసు రక్షణ కల్పించాలని కోరింది. అయితే కేంద్రాలను మార్చేందుకు నిరాకరించిన న్యాయస్థానం, అభ్యర్థితో పాటు ఇద్దరు ప్రతిపాదకులు (1+2) లోపలికి వెళ్లేలా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు రక్షణ కల్పించాలని ఆదేశించింది.
ఈ పరిణామాలపై స్పందించిన బీటెక్ రవి... ఈ ప్రాంతంలో ఏదో జరిగిపోతోందని సాక్షి ఛానల్, వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టు ఆర్డర్ రాత్రి 8 గంటల సమయంలో రాగా, అంతకుముందే సాయంత్రం 5 గంటలకే 13 మంది ఎలాంటి అడ్డంకులు లేకుండా నామినేషన్లు దాఖలు చేశారని ఆయన పేర్కొన్నారు. దీన్నిబట్టే వారు కోర్టులను ఎలా తప్పుడోవ పట్టిస్తున్నారో అర్థమవుతోందని అన్నారు.