పొరపాటున యూపీఐలో వేరే వారికి డబ్బు పంపారా? తిరిగి పొందడానికి ఏం చేయాలి

Business
Advertisement
  • పొరపాటును గుర్తించిన మొదటి కొన్ని నిమిషాలు అత్యంత కీలకం
  • లావాదేవీ ఐడీ, యూటీఆర్ నంబర్, తేదీ, పొరపాటుగా వెళ్లిన యూపీఐ ఐడీ వివరాలు అవసరం
  • ఏ యూపీఐ యాప్ ద్వారా డబ్బులు పంపారో ముందు ఆ యాప్‌లో ఫిర్యాదు చేయాలి
  • యాప్‌లో ఫిర్యాదు చేసిన వెంటనే ఖాతా ఉన్న బ్యాంకు శాఖకు లేదా కస్టమర్ కేర్‌కు సమాచారం ఇవ్వాలి
  • అవతలి వ్యక్తి నిరాకరిస్తే పోలీస్‌ లేదా లీగల్‌ లేదా అంబుడ్స్‌మన్‌ మార్గం
స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే క్షణాల్లో పనులు పూర్తయిపోతున్నాయి. టీ కొట్టు మొదలుకుని పెద్ద షోరూమ్‌ల వరకు నగదు చెల్లింపుల కోసం యూపీఐ వాడటం నిత్య జీవితంలో భాగమైపోయింది. నంబర్ ఎంటర్ చేసి పిన్ కొట్టడం ఆలస్యం.. డబ్బులు అవతలి వారికి చేరిపోతాయి. అయితే ఏమరుపాటుగా ఒక్క చిన్న అంకె తప్పుగా కొట్టినా.. కష్టపడి సంపాదించిన డబ్బులు మరొకరి ఖాతాలోకి వెళ్లిపోతాయి. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు కంగారుపడకుండా డబ్బులను ఎలా వెనక్కి తెచ్చుకోవాలి? అవతలి వ్యక్తి ఇవ్వడానికి నిరాకరిస్తే చట్టం ఏం చెబుతోంది? తదితర వివరాలు తెలుసుకుందాం.

వెంటనే అలర్ట్ కావాలి
పొరపాటును గుర్తించిన మొదటి కొన్ని నిమిషాలు అత్యంత కీలకం. లావాదేవీ విజయవంతం అయిందా? లేదా ఫెయిల్ అయిందా? అనేది యాప్‌లో చూసుకోవాలి. లావాదేవీ ఐడీ, యూటీఆర్ నంబర్, పంపిన తేదీ, సమయం, పొరపాటుగా వెళ్లిన యూపీఐ ఐడీ వివరాలను స్క్రీన్‌షాట్ రూపంలో భద్రపరుచుకోవాలి.

యాప్‌లో ఫిర్యాదు చేయండి
గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి ఏ యూపీఐ యాప్ ద్వారా డబ్బులు పంపారో, ఆ యాప్‌లోని లావాదేవీ హిస్టరీలోకి వెళ్లాలి. అక్కడ 'హెల్ప్' లేదా 'రైజ్ డిస్ప్యూట్/కంప్లైంట్' ఆప్షన్‌ను ఎంచుకుని పొరపాటున వేరే ఖాతాకు డబ్బులు పంపినట్లు ఫిర్యాదు నమోదు చేయాలి. ఆ కంప్లైంట్ రిఫరెన్స్ నంబర్‌ను భద్రపరుచుకోవాలి.

బ్యాంకును ఆశ్రయించండి
యాప్‌లో ఫిర్యాదు చేసిన వెంటనే ఖాతా ఉన్న సొంత బ్యాంకు శాఖకు లేదా కస్టమర్ కేర్‌కు సమాచారం ఇవ్వాలి. యూటీఆర్ నంబర్, లావాదేవీ ఆధారాలతో తప్పుడు బదిలీపై అధికారిక ఫిర్యాదు చేయాలి. మీ బ్యాంకు సదరు యూటీఆర్ ఆధారంగా డబ్బులు అందుకున్న వ్యక్తి బ్యాంకును సంప్రదించి రికవరీ ప్రక్రియను మొదలుపెడుతుంది. అవతలి బ్యాంకు తమ కస్టమర్‌తో మాట్లాడి డబ్బులు తిరిగి పంపేలా చూస్తుంది.

అవతలి వ్యక్తి నిరాకరిస్తే ఏంటి?
బ్యాంకు నేరుగా అవతలి వ్యక్తి ఖాతా నుంచి డబ్బులను వెనక్కి తీసుకోలేదు. దానికి ఆ ఖాతాదారుడి సమ్మతి తప్పనిసరి. పొరపాటున తన ఖాతాకు డబ్బు వచ్చిందని తెలిసిన తర్వాత కూడా తిరిగి ఇవ్వడానికి మొండికేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. భారత కాంట్రాక్ట్ చట్టం 1872లోని సెక్షన్ 72 ప్రకారం.. పొరపాటున లేదా ఒత్తిడితో అందిన సొమ్ముపై ఎవరికీ హక్కు ఉండదు. దానిని వెంటనే తిరిగి చెల్లించాలి. లీగల్ నోటీసు పంపడం ద్వారా సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చు. మోసపూరిత ఉద్దేశంతో ఉంచుకున్నట్లు ఆధారాలు ఉంటే పోలీసులను కూడా ఆశ్రయించే అవకాశముంది.

ఎన్‌పీసీఐ పోర్టల్‌లో ఫిర్యాదు
బ్యాంకు లేదా యాప్ ద్వారా సమస్య కొలిక్కి రాకపోతే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అధికారిక వెబ్‌సైట్‌ను ఆశ్రయించవచ్చు. పోర్టల్‌లోని 'గెట్ ఇన్ టచ్' విభాగానికి వెళ్లి యూపీఐ కంప్లయింట్ ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ లావాదేవీ రకం, యూటీఆర్ నంబర్, బ్యాంక్ వివరాలు, ఖాతా నుంచి నగదు కట్ అయినట్లు తెలిపే బ్యాంక్ స్టేట్‌మెంట్ కాపీని జతచేసి అధికారికంగా ఫిర్యాదు నమోదు చేయాలి.

ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్ మార్గం
బ్యాంకుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన తర్వాత 30 రోజుల్లోగా ఎలాంటి స్పందన రాకపోయినా, లేదా బ్యాంకు ఇచ్చిన సమాధానం అసంతృప్తిగా ఉన్నా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఆర్‌బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ కింద ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా ఈ దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమైతే అంబుడ్స్‌మన్ జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి ఆదేశాలు ఇస్తుంది.

1930 హెల్ప్‌లైన్‌ను ఎప్పుడు ఆశ్రయించాలి?
చాలామంది పొరపాటు లావాదేవీలకు కూడా వెంటనే సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేస్తుంటారు. కానీ 1930 హెల్ప్‌లైన్ కేవలం సైబర్ మోసాలు, ఆర్థిక నేరాల బాధితుల కోసమే ఉద్దేశించినది. ఎవరైనా మోసం చేసి, నకిలీ లింకులు పంపి మీ ఖాతా నుంచి డబ్బులు కాజేస్తే వెంటనే ఈ నంబరుకు ఫోన్ చేయాలి. ఒకవేళ మీరు మీ స్వహస్తాలతో వేరేవారి యూపీఐ ఐడీకి పొరపాటున నగదు బదిలీ చేస్తే దాన్ని సాధారణ బ్యాంకింగ్ వివాదంగానే పరిగణిస్తారు.

నివారణే మేలైన మార్గం
ఒక్కసారి నగదు బదిలీ అయ్యాక దాన్ని తిరిగి పొందడం సమయంతో కూడుకున్న వ్యవహారం. అందుకే కొత్తవారికి పెద్ద మొత్తంలో నగదు పంపేటప్పుడు ముందుగా ఒక రూపాయి పంపి నిర్ధారించుకోవడం మంచి పద్ధతి. స్కానర్ లేదా యూపీఐ ఐడీ ఎంటర్ చేయగానే స్క్రీన్‌పై కనిపించే లబ్ధిదారుడి అసలు పేరును ఒకటికి రెండుసార్లు సరిచూసుకున్న తర్వాతే యూపీఐ పిన్ నమోదు చేయాలి.
Advertisement

సంబంధిత వార్తలు

UPIWrong UPI TransactionNPCI ComplaintRBI OmbudsmanUPI Money RecoveryBank Refund Process

More Telugu News

ధోనీ రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ భావోద్వేగ పోస్ట్

18 Nov, 13:15

వైఎస్ అవినాశ్ రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు

18 Nov, 13:01

కైలాసగిరికి సరికొత్త రోప్‌వే, సింగపూర్ తరహా గ్రావిటీ రైడ్

18 Nov, 12:51

ఎలాన్ మస్క్‌కు అంబానీ గట్టి పోటీ.. స్టార్‌లింక్‌ను ఢీకొట్టేందుకు రిలయన్స్ మాస్టర్ ప్లాన్!

18 Nov, 12:49

పాకిస్థాన్‌పై భారత్ సంచలన విజయం.. చివర్లో పాక్ ఆటగాళ్ల ఊహించని పనితో నెటిజన్లు ఫిదా

18 Nov, 12:45

ఆయనొస్తే ఇంటి గేట్లు తీయను.. వెంకీ కుడుములపై మెగాస్టార్ చిరు చమత్కారం

18 Nov, 12:42

దూసుకొస్తున్న ఆక్వాన్ తుపాను.. ప్రజల ప్రాణాలే తొలి ప్రాధాన్యత అన్న అనిత

18 Nov, 12:27

అనంతపురం: బాలిక కడుపులో 750 గ్రాముల వెంట్రుకలు.. ఇదో అరుదైన వ్యాధి

18 Nov, 11:58

బంగారం, వెండి ధరలు ఢమాల్: డాలర్ బలం, వడ్డీ రేట్ల భయంతో పతనం

18 Nov, 11:57

ఏఐ ఘోర తప్పిదాలు.. సైనిక లక్ష్యాలుగా పాఠశాలలు, పౌరులను గుర్తిస్తున్న ఏఐ మోడల్స్

18 Nov, 11:34

టాస్క్‌ఫోర్స్ సోదాలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు.. డీజీపీ, హోంశాఖకు నోటీసులు

18 Nov, 11:14

టోల్‌ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలోని స్థానిక వాహనదారులకు రాయితీతో వార్షిక లోకల్ పాస్

18 Nov, 11:08

వాహనదారులకు బిగ్ అలర్ట్.. టోల్‌గేట్ దాటితే చాలు రూ.10 వేల ఫైన్ పడే కొత్త రూల్!

18 Nov, 11:06

పెట్రోల్ ఖర్చు సొంతంగా భరించిన సెహ్వాగ్ కొడుకులు: తండ్రి చెప్పిన డబ్బు పాఠం

18 Nov, 11:04
..More Telugu News