సమ్మక్క సాగర్‌ బ్యారేజీకి ఎన్‌ఓసీ ఇవ్వండి: ఛత్తీస్‌గఢ్‌ సీఎంకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

Telangana
Advertisement
  • రాయ్‌పూర్‌లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ
  • సమ్మక్క సాగర్ ప్రాజెక్టు ఎన్‌ఓసీ మంజూరుపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి సానుకూల స్పందన
  • తుపాకులగూడెం వద్ద ఇప్పటికే పూర్తయిన బ్యారేజీ నిర్మాణం
  • నిబంధనల ప్రకారం పరిహారం, పునరావాస నిధులు ఇచ్చేందుకు తెలంగాణ సిద్ధం
ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మించిన బహుళ ప్రయోజనాల సమ్మక్క సాగర్ బ్యారేజీకి సంబంధించి వెంటనే నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) జారీ చేయాలని ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమ్మక్క సాగర్ ప్రాజెక్టు సమగ్ర వివరాలను ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి వివరించి, త్వరితగతిన ఎన్‌ఓసీ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం విష్ణుదేవ్ సాయి సానుకూలంగా స్పందిస్తూ, ఎన్‌ఓసీ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణలో నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రజల తాగు, సాగునీటి అవసరాల నిమిత్తం సమ్మక్క సాగర్‌ బ్యారేజీలో నీటిని నిల్వ చేసుకునేందుకు అనుమతించాలని, మిగిలిన క్లియరెన్సుల విషయంలోనూ సహకరించాలని కోరారు. కరవు ప్రభావిత, వెనుకబడిన, గిరిజన ప్రాంతాల అవసరాలను తీర్చేందుకు గోదావరి జలాలను వినియోగించుకోవడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.

గతంలో ఈ ప్రాజెక్టును కాంతనపల్లి వద్ద ప్రతిపాదించగా, అక్కడ 11,408 ఎకరాల భూమి ముంపునకు గురయ్యే పరిస్థితి ఉండేది. దీనివల్ల 17 ఆదివాసీ గ్రామాలు మునిగిపోవడంతో పాటు భద్రత, మౌలిక వసతులపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఏర్పడింది. దాంతో ముంపు తీవ్రతను కనిష్ఠ స్థాయికి తగ్గించేందుకు బ్యారేజీ నిర్మాణ ప్రదేశాన్ని తుపాకులగూడెంకు మార్చినట్లు ముఖ్యమంత్రి వివరించారు.

ప్రాజెక్టు ప్రభావంపై అధ్యయనం జరిపేందుకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం కోరిన మేరకు తెలంగాణ సర్కార్ రూ. 9.883 కోట్లను ఏప్రిల్‌లోనే చెల్లించింది. అనంతరం క్షేత్రస్థాయి అధ్యయనం పూర్తి చేసిన ఐఐటీ ఖరగ్‌పూర్‌ తన నివేదికను జూలై 30న ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి అందజేసింది. తుపాకులగూడెం వద్ద బ్యారేజీ నిర్మించడం వల్ల ఛత్తీస్‌గఢ్‌ పరిధిలో కేవలం 33 ఎకరాల భూమి మాత్రమే ముంపునకు గురవుతుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. అత్యంత భారీ వరదలు వచ్చిన సందర్భంలో కూడా ఈ ముంపు ప్రాంతం 100 ఎకరాలకు మించదని తేలింది.

తుపాకులగూడెం వద్ద ఇప్పటికే సమ్మక్క సాగర్‌ బ్యారేజీ నిర్మాణం పూర్తయింది. పూర్తిస్థాయి నీటిమట్టం +83 మీటర్ల వద్ద ఈ బ్యారేజీ నిల్వ సామర్థ్యం 6.94 టీఎంసీలుగా ఉంది. ఛత్తీస్‌గఢ్ భూభాగంలో అవసరమైన భూసేకరణ, పరిహారం, పునరావాస చర్యలకు సంబంధించి నిబంధనల ప్రకారం నిధులు చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్మాణం పూర్తయినందున ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎన్‌ఓసీ జారీతో పాటు ఇతర అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

Revanth ReddySammakka Sagar barrageChhattisgarh CMTupakulagudem barrage NOCRaipur CM meetingTelangana irrigation projects

More Telugu News

అక్వాన్ ఎఫెక్ట్.. నెల్లూరులో 200 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం

17 Nov, 16:17

తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా?: షర్మిల

17 Nov, 16:15

తెలంగాణ ఇచ్చింది సోనియమ్మే అయితే.. ఆత్మకథలో ఎందుకు రాయలేదు?: కేటీఆర్

17 Nov, 16:03

అశ్విన్ విశ్లేషణ అక్షరాలా నిజమైంది.. ధోనీ రిటైర్మెంట్‌పై మాజీ స్పిన్నర్ ఊహించినట్లే జరిగింది!

17 Nov, 15:59

ఐఫోన్ డ్యూయో కోసం కొత్త ఫీచర్లు.. యాపిల్ నుంచి సూపర్ అప్‌డేట్!

17 Nov, 15:48

భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక మార్పులు.. ఆ కంటెంట్‌కు చెక్!

17 Nov, 15:35

మనిషి మొహంలో పిల్లి రూపం కనిపిస్తోంది: బ్రెయిన్ సర్జరీ తర్వాత యువకుడికి వచ్చిన వింత వ్యాధి!

17 Nov, 15:30

'ప్రేమద ఊరలి' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

17 Nov, 15:26

ఐపీఎల్ కు గుడ్ బై చెప్పిన ధోనీ.. ఇది కూడా కూల్ గా చెప్పేశాడు!

17 Nov, 15:24

మహీంద్రా ఎలక్ట్రిక్ కారు సరికొత్త రికార్డ్.. భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టుల్లో 5-స్టార్ రేటింగ్

17 Nov, 15:03

చిన్న గొడవకే ప్రాణం తీశారు.. భద్రాచలం లాడ్జిలో యువకుడి హత్య!

17 Nov, 14:59

అమెరికా గడ్డపైనే ‘డర్టీ బాంబ్’ బ్లాస్ట్?.. వాషింగ్టన్‌ను వణికిస్తున్న ఇరాన్ మాస్టర్ ప్లాన్!

17 Nov, 14:56

అమెరికాలో నిలిచిన బ్యాంకింగ్ లావాదేవీలు... కారణం ఇదే!

17 Nov, 14:50

ఆసీస్ క్రికెట్‌లో 'శాండ్‌పేపర్‌ గేట్‌'పై మళ్లీ దుమారం.. అభిమానులకు సమాధానం చెప్పాలన్న హేడెన్

17 Nov, 14:49
..More Telugu News