అమరావతిలో మీడియా సిటీ.. రాజధానికి మరో ఆకర్షణ

Andhra
Advertisement
  • ఏపీలో యానిమేషన్, గేమింగ్ రంగాల కోసం కొత్త ఏవీజీసీ-ఎక్స్ఆర్ పాలసీ
  • రూ.5,000 కోట్ల పెట్టుబడులు, లక్ష ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యం
  • పరిశ్రమలకు మూలధన సబ్సిడీ, ఎస్‌జీఎస్‌టీ వాపసు వంటి భారీ ప్రోత్సాహకాలు
  • 2026 నుంచి 2031 వరకు ఐదేళ్ల పాటు పాలసీ
ఆంధ్రప్రదేశ్‌లో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఏవీజీసీ-ఎక్స్ఆర్ ) రంగాన్ని బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి రూ.5,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, లక్ష ఉద్యోగాల సృష్టిని లక్ష్యంగా పెట్టుకుని 'ఏవీజీసీ-ఎక్స్ఆర్ విధానం 2026-31'కి తుదిరూపునిచ్చింది. ఇందులో భాగంగా రాజధాని అమరావతిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 'మీడియా సిటీ'ని, ప్రత్యేక పార్కును అభివృద్ధి చేయనుంది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 10న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నూతన విధానానికి ఆమోదముద్ర పడగా, తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. 2026 నుంచి 2031 వరకు ఐదేళ్ల పాటు అమల్లో ఉండే ఈ పాలసీ ద్వారా ఐదు యాంకర్ యూనిట్లతో పాటు మరో 100 కంపెనీల నుంచి పెట్టుబడులు రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అమరావతిలోని మీడియా సిటీలో అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి బాధ్యతను ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్‌డీఏ)కు అప్పగించారు.

ఈ విధానం ద్వారా రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించే సంస్థలకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఏవీజీసీ-ఎక్స్ఆర్ మౌలిక వసతుల కల్పనకయ్యే ఖర్చులో 50 శాతం రాయితీ (గరిష్ఠంగా రూ.2 కోట్లు), పార్కుల అభివృద్ధికి ప్రాజెక్టు వ్యయంలో 25 శాతం (గరిష్ఠంగా రూ.50 కోట్లు) సబ్సిడీని ప్రభుత్వం అందించనుంది. వీటితో పాటు ఐదేళ్ల పాటు వంద శాతం రాష్ట్ర జీఎస్టీ వాపసు, స్టాంప్ డ్యూటీ మినహాయింపు వంటి ప్రయోజనాలు కల్పించనుంది. రూ.200 కోట్ల పెట్టుబడితో కనీసం 200 మందికి ఉపాధి కల్పించే సంస్థలను 'మెగా ప్రాజెక్టులు'గా గుర్తించి ప్రత్యేక రాయితీలు అందజేయనున్నారు.

అమరావతిలో సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఏవీజీసీ-ఎక్స్ఆర్ పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆమోదం పొందిన రోబోటిక్స్, సెమీకండక్టర్ విధానాలతో పాటు ఈ ఏవీజీసీ-ఎక్స్ఆర్ పాలసీకి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా.. రాష్ట్రంలో సాంకేతిక రంగం, నవకల్పనల అభివృద్ధికి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టమవుతోంది.
Advertisement

సంబంధిత వార్తలు

Amaravati Media CityAVGC XR Policy 2026 31Andhra Pradesh GovernmentChandrababu NaiduAnimation Visual Effects GamingAP CRDA

More Telugu News

అమ్మానాన్న తొలిసారి కలిసిన రెస్టారెంట్‌కు నా గర్ల్‌ఫ్రెండ్‌తో వెళ్లా: రాహుల్ గాంధీ

17 Nov, 08:24

హైదరాబాద్‌లో రోడ్ల పండుగ.. హాజరుకానున్న 3000 మందికి పైగా దేశ, విదేశీ ప్రతినిధులు

17 Nov, 08:07

భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు గట్టి ఎదురుదెబ్బ

17 Nov, 07:55

ఏపీలో ‘స్పేస్ సిటీ’.. శ్రీహరికోట సమీపంలో భారీ ప్రణాళిక

17 Nov, 07:44

అవినీతికి పాల్పడితే వేటే.. పోలీసు సిబ్బందికి కొత్త సీపీ మహేశ్ భగవత్ స్ట్రాంగ్ వార్నింగ్

17 Nov, 07:22

సీజేఐపై న్యాయవాది అనుచిత వ్యాఖ్యలు.. భద్రతా సిబ్బందితో బయటకు పంపిన సుప్రీంకోర్టు

17 Nov, 07:06

అమెరికాలో భారత విద్యార్థుల సంఖ్యకు బ్రేక్.. 6.5 శాతం తగ్గుదల

17 Nov, 06:58

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. పదేళ్ల తర్వాత చేతికి పట్టాలు

17 Nov, 06:44

కొత్త పింఛనుదారులకు శుభవార్త.. ఈ నెల 19న ఖాతాల్లోకి రూ.2 వేలు

17 Nov, 06:41

అమెరికా ఎన్నికల ఫలితాలు.. భారత విద్యార్థులకు ఊరట దక్కేనా?

17 Nov, 06:39

160 ఏళ్ల చారిత్రక భవనంలోకి డీకే.. గృహప్రవేశం పూర్తి

17 Nov, 06:36

63 ఆర్థిక సంస్థలపై ఆర్బీఐ వేటు.. 49 ఎన్‌బీఎఫ్‌సీల లైసెన్సులు రద్దు

17 Nov, 06:28

అభిషేక్ బచ్చన్ ఫోన్ నుంచి రాణికి ప్రియాంక మెసేజ్.. ఆ తర్వాత ఏమైందంటే?

17 Nov, 06:27

ఈ సినిమాలో చాన్స్ రావడం దైవసంకల్పం: 'ఓం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రేణూ దేశాయ్

16 Nov, 22:50
..More Telugu News