మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారిణిపై ఏసీబీ దాడులు.. అక్రమాస్తుల గుర్తింపు

Telangana
Advertisement
  • ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. 10 చోట్ల ఏకకాలంలో సోదాలు
  • లంచం కేసు తర్వాత మరో చిక్కు.. అధికారిణి ఆస్తులపై ఏసీబీ నజర్‌
  • గుండు వాణి ఇళ్లు, బంధువుల నివాసాల్లో ఏసీబీ తనిఖీలు
  • రూ.75 వేల లంచం కేసు.. ఇప్పుడు ఆస్తుల లెక్కలు తీస్తున్న ఏసీబీ
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో మోయినాబాద్‌ మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి గుండు వాణిపై ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోమవారం హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ సహా పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఆమెకు సంబంధించిన నివాసం, బంధువుల ఇళ్లు, ఇతర ప్రాంతాలు కలిపి మొత్తం 10 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు.

రంగారెడ్డి, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. స్థిర, చరాస్తులు, బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు, ఆదాయ మార్గాలు, ఆస్తుల సమీకరణ వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఆదాయ వనరులకు మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు వాణిపై ఆరోపణలు ఉన్నాయి.

సెప్టెంబర్‌ 30న లంచం కేసులో ఆమె ఏసీబీకి పట్టుబడిన ఘటన ఈ దర్యాప్తునకు కారణమైంది. అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రూ.75 వేల లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమె తరఫున ఆ మొత్తాన్ని స్వీకరిస్తుండగా మోయినాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యాలమోని సుదర్శన్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి రూ.75 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు తర్వాత వాణిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి తాజా సోదాలు చేపట్టారు.
Advertisement

సంబంధిత వార్తలు

Gundu VaniACB Raids TelanganaMoinabad Town Planning OfficerDisproportionate Assets CaseHyderabad ACB SearchesAnti Corruption Bureau

More Telugu News

బిల్కిస్ బానో కేసు.. 17 ఏళ్ల జైలు తర్వాత ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్

16 Nov, 14:07

హైదరాబాదీలకు బిర్యానీ షాక్.. భారీగా పెరిగిన ధరలు!

16 Nov, 13:41

'ఓం' కోసం జుట్టు కట్ చేయడంతో అమ్మ బాగా బాధపడింది: సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు!

16 Nov, 13:28

బాంబు బెదిరింపుల వేళ అమితాబ్‌ పోస్ట్‌.. ‘బతికిపోయాం’ అంటూ వ్యాఖ్య

16 Nov, 13:26

వాట్సాప్‌లో ‘జాప్స్‌’ ఫీచర్‌.. చూసిన వెంటనే మాయమయ్యే ఫొటోలు, వీడియోలు!

16 Nov, 13:26

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విషాదం.. హాస్టల్ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

16 Nov, 13:16

మధురై తనిష్క్ దోపిడీ నిందితుడిని పట్టించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తి

16 Nov, 13:08

భారత్ ఏఐ పాలసీ భేష్.. యూర‌ప్‌లా కఠినంగా లేదు: ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ

16 Nov, 13:03

హైదరాబాద్‌ సదస్సులో ‘ఓట్‌ చోర్‌’ నినాదం.. ఇటలీ నేత వీసా నిబంధనలు ఉల్లంఘించారా?

16 Nov, 13:00

శబరిమల యాత్రకు వేళాయె.. రోజుకు 80 వేల మందికి దర్శనం

16 Nov, 12:55

సంగీత దర్శకుడిగా 15 ఏళ్లు.. అనిరుధ్ భావోద్వేగ సందేశం

16 Nov, 12:50

ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

16 Nov, 12:48

సచిన్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం దంప‌తులు.. ఇదిగో వీడియో!

16 Nov, 12:22

శ్రీకాకుళంలో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. బ్యారికేడ్లను ఢీకొట్టిన బీజేపీ నేత కారు

16 Nov, 12:20
..More Telugu News