జిమ్‌లో వ్యాయామం చేస్తూ కిటికీలోంచి ఎలా పడిపోయిందో చూడండి.. 22 ఏళ్ల యువతి దుర్మరణం
Advertisement
- ఇండోనేషియాలోని ఓ జిమ్‌లో చోటుచేసుకున్న తీవ్ర విషాదం
- ట్రెడ్‌మిల్‌పై నడుస్తూ పట్టుతప్పి మూడో అంతస్తు కిటికీలోంచి పడ్డ యువతి
- తీవ్ర తలగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- ట్రెడ్‌మిల్‌కు కిటికీకి మధ్య కేవలం 60 సెంటీమీటర్ల దూరమే ఉన్నట్లు గుర్తింపు
- నిర్లక్ష్యం ఆరోపణలతో జిమ్ యజమానిపై కేసు నమోదు చేసిన పోలీసులు
ఇండోనేషియాలోని వెస్ట్ కలిమంతన్ పరిధిలో ఉన్న పొంటియానాక్ నగరంలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా ప్రమాదవశాత్తు మూడో అంతస్తు కిటికీలోంచి కిందపడి 22 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. జిమ్ నిర్వహణలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. ఫాతియా (22) అనే యువతి తన స్నేహితుడు, తమ్ముడితో కలిసి స్థానిక ‘కే-జిమ్’కు వెళ్లింది. అక్కడ మూడో అంతస్తులోని ట్రెడ్‌మిల్ విభాగంలో ఆమె వర్కవుట్ ప్రారంభించింది. సుమారు 30 నిమిషాల పాటు ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేసిన తర్వాత, ఆమె నడక వేగాన్ని నెమ్మదింపజేసింది. ఆ సమయంలో అకస్మాత్తుగా బ్యాలెన్స్ తప్పి వెనక్కి తూలింది.
ట్రెడ్‌మిల్ వెనుక భాగానికి, తెరిచి ఉన్న కిటికీకి మధ్య కేవలం 60 సెంటీమీటర్ల (సుమారు 2 అడుగులు) దూరం మాత్రమే ఉంది. అంతేకాకుండా, ఆ కిటికీ ఫ్లోర్ నుంచి కేవలం 30 సెంటీమీటర్ల ఎత్తులోనే ఉండటంతో పాటు సుమారు 90 సెంటీమీటర్ల వెడల్పుతో తెరిచి ఉంది. దీంతో బ్యాలెన్స్ కోల్పోయిన యువతి నేరుగా ఆ కిటికీ గుండా మూడో అంతస్తు నుంచి కింద పడిపోయింది.
తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే పొంటియానాక్‌లోని యూనివర్సిటాస్ తంజుంగ్‌పురా ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడం, తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆమె చికిత్స పొందుతూ మృతిచెందింది. పోస్టుమార్టం నివేదికలోనూ ఆమె తల, ముఖం మరియు శరీర భాగాలపై తీవ్ర గాయాలు అయినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు రావడంతో తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జిమ్‌లో పరికరాల అమరిక, భద్రతా లోపాలపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు, జిమ్‌ను తాత్కాలికంగా మూసివేయించారు. భద్రతా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను జిమ్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.