తండ్రి పిల్లలను చూసుకోవడం ఎవరికీ చేసే ఉపకారం కాదు: ఉపాసన
Advertisement
- పిల్లల పెంపకంపై సమాజంలో ఉన్న ద్వంద్వ ప్రమాణాలను ప్రశ్నించిన ఉపాసన
- తండ్రి పిల్లలను చూసుకోవడం కేవలం బాధ్యత మాత్రమేనని స్పష్టీకరణ
- చరణ్ పిల్లలకు తినిపిస్తుంటే ముచ్చటపడేదాన్నని, కానీ అది సాధారణ బాధ్యతని గ్రహించానని వెల్లడి
పిల్లల పెంపకం, బాధ్యతల విషయంలో సమాజం చూసే విధానంలో మార్పు రావాలని ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల స్పష్టం చేశారు. పిల్లల సంరక్షణలో తల్లిదండ్రుల బాధ్యతలపై సమాజంలో ఉన్న అసమానతలను ఉపాసన ప్రస్తావించారు. "ఒక తండ్రి పిల్లకు అన్నం తినిపించినా లేదా డైపర్ మార్చినా.. ఎంత మంచి తండ్రో అంటూ అందరూ ప్రశంసిస్తూ చప్పట్లు కొడతారు. మరి అదే పని తల్లి రోజూ చేస్తున్నప్పుడు ఆమె కోసం ఎవరైనా చప్పట్లు కొడుతున్నారా? ఇంట్లో ఈ ఆలోచనా విధానం మారకపోతే, బయట కార్పొరేట్ బోర్డు రూముల్లోనూ మహిళలకు సమానత్వం రాదు. పిల్లలను చూసుకోవడం ద్వారా తండ్రి ఎవరికీ ఎలాంటి ఉపకారం చేయడం లేదు. అది పెంపకంలో అతని ప్రాథమిక బాధ్యత మాత్రమే. ఇది మన విద్యా విధానంలో, ప్రజల ఆలోచనల్లో భాగం కావాలి" అని ఆమె పేర్కొన్నారు.
తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ... రామ్ చరణ్ పిల్లలకు భోజనం పెడుతుంటే గతంలో తాను కూడా ఎంతో ముచ్చటగా చూసేదాన్నని, అయితే తల్లిదండ్రులుగా అది ఒక సాధారణ బాధ్యత అని ఇప్పుడు గ్రహించానని ఉపాసన వివరించారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు 2023లో జన్మించిన కుమార్తె క్లిన్ కారాతో పాటు, 2026లో కవలలు శివరామ్, అన్వీరా దేవి జన్మించిన సంగతి తెలిసిందే.