ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫైనల్ ఛార్జ్‌షీట్.. కేసీఆర్, కేటీఆర్‌లకు బిగుస్తున్న ఉచ్చు!
Advertisement
- ఫోన్ ట్యాపింగ్ కేసులో తుది ఛార్జ్‌షీట్ సిద్ధం చేస్తున్న సిట్
- కేసీఆర్‌ను ఏ1, కేటీఆర్‌ను ఏ2గా పేర్కొనేందుకు సన్నాహాలు
- ఫోరెన్సిక్, సాంకేతిక ఆధారాలతో పటిష్ఠంగా ఛార్జ్‌షీట్ రూపకల్పన
- ఎలక్టోరల్ బాండ్ల కోసం బెదిరింపుల ఆరోపణలపై కీలక వాంగ్మూలం
- ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రైవేటు వ్యక్తుల పాత్రపైనా ప్రస్తావన
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుంది. ఈ కేసులో నాటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను ప్రధాన నిందితుడిగా (ఏ1), ఆయన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ను రెండో నిందితుడిగా (ఏ2) పేర్కొంటూ తుది ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
చట్టవిరుద్ధమని తెలిసినప్పటికీ ఫోన్ ట్యాపింగ్‌కు అనుమతులు ఇచ్చారని, తమకు అనుకూలంగా ఉండే అధికారులను ఇంటెలిజెన్స్, ఎస్‌ఐబీ వంటి కీలక విభాగాల్లో నియమించి ఈ అక్రమాలకు పాల్పడ్డారని సిట్ భావిస్తోంది. ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలతో పాటు పలువురు సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్ చేయడం వెనుక భారీ కుట్ర ఉందని దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. దీనిపై సిట్ అధికారులు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించినట్లు సమాచారం.
ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా వందలాది మంది బాధితుల వాంగ్మూలాలను, బలమైన ఫోరెన్సిక్, సాంకేతిక ఆధారాలను సిట్ సేకరించింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారంతో బెదిరింపులకు పాల్పడి, ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు సేకరించారన్న ఆరోపణలకు సంబంధించి ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులో అత్యంత కీలకంగా మారనుంది. ఛార్జ్‌షీట్‌ను పటిష్ఠంగా రూపొందించేందుకు సుప్రీంకోర్టు న్యాయనిపుణుల సలహాలు కూడా తీసుకున్నారు.
కేసీఆర్‌ను ప్రధాన సూత్రధారిగా పేర్కొంటూ, మావోయిస్టుల పేరిట నంబర్లకు అనుమతిచ్చిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఈ వ్యవహారంలో సహకరించిన ప్రైవేటు వ్యక్తుల పేర్లను కూడా ఛార్జ్‌షీట్‌లో చేర్చనున్నట్లు సమాచారం. మరోవైపు, దర్యాప్తు వివరాలు బయటకు పొక్కుతుండటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల పోలీసు ఉన్నతాధికారులపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.