Advertisement

నా ఫోన్‌ను మోదీ ట్యాప్‌ చేస్తున్నారు.. రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణ

National
Advertisement
  • మోదీతో ముఖాముఖి చర్చకు రాహుల్‌ మరోసారి సవాల్‌
  • పార్లమెంటులో తన మైక్‌ నిలిపివేస్తున్నారన్న ప్రతిపక్ష నేత
  • కీలక అంశాలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని విమర్శ
  • ఢిల్లీ కాలుష్యాన్ని ప్రస్తావిస్తూ, ప్రధాని ఏసీ గది నుంచి బయటకు రావాలని వ్యాఖ్య
  • మోదీ తన విషయంలో ఆచితూచి మాట్లాడుతున్నారని వ్యాఖ్య
తన ఫోన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో ట్యాప్‌ చేస్తున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. విదేశీ శక్తుల సాయంతో దేశంలో అరాచకం సృష్టించేందుకు రాహుల్‌ ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఆయన ఈ వ్యాఖ్యలతో బదులిచ్చారు. తన ఫోన్‌లోనే ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని కాంగ్రెస్‌ అధికారిక ఎక్స్‌ ఖాతాలో విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు.

ప్రధాని మోదీతో ముఖాముఖి చర్చకు రావాలన్న సవాలును రాహుల్‌ మరోసారి పునరుద్ఘాటించారు. ఆ చర్చకు మోదీ వస్తే ఎవరు విదేశీ శక్తుల నియంత్రణలో ఉన్నారు? ఎవరు దేశ వ్యతిరేకి? అన్న విషయాలు బయటపడతాయని అన్నారు. చర్చ జరిగితే ప్రధాని రాజకీయ జీవితం ముగిసిపోతుందని వ్యాఖ్యానించారు. తాను ప్రసంగాల రూపంలో సాగే చర్చను కోరుకోవడం లేదని, ఇద్దరి మధ్య నేరుగా చర్చ జరగాలని స్పష్టం చేశారు.

పార్లమెంటులో చర్చకు ప్రయత్నించినా తన మైక్‌ నిలిపివేస్తున్నారని, మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని రాహుల్‌ ఆరోపించారు. రైతు చట్టాలు, ఓట్ల చోరీ, ఎస్‌ఐఆర్‌, చైనా తదితర అంశాలపై తనకు మాట్లాడే అవకాశం రాలేదన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పార్లమెంటులో చర్చకు రావాలంటూ చేసిన సవాలుపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని ప్రస్తావిస్తూ.. ప్రధాని తన ఏసీ గది నుంచి బయటకు వచ్చి సామాన్యులు పీల్చే గాలిని పీల్చాలని రాహుల్‌ అన్నారు. తనపై మోదీ గతంలో మాదిరిగా విమర్శలు చేయడం లేదని, ఆచితూచి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. దీనికి కారణం ఆయన మనసులో ఉన్న భయమేనని రాహుల్‌ వ్యాఖ్యానించారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Rahul GandhiNarendra ModiPhone Tapping AllegationsIndian National CongressAmit ShahDelhi Air Pollution

More Telugu News

రాహుల్ ఆలోచనలను విదేశీయులు హ్యాక్ చేశారు.. ఫోన్ ను హ్యాక్ చేయాల్సిన అవసరం మాకేంటి?: బీజేపీ

13 Nov, 19:08

ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరం లాహోర్ కాదు.. మన ఢిల్లీయే!

13 Nov, 19:07

మూడ్నాలుగు విజిల్స్ వచ్చినా కుక్కర్ లో అన్నం, పప్పు ఉడకలేదు.. కేసు గెలిచిన విశాఖ మహిళ!

13 Nov, 18:52

టైమ్‌కు ఫ్లాట్‌లు అప్పగించని బిల్డర్లపై రెరా కొరడా.. 10.85 శాతం వడ్డీతో కట్టిన మొత్తం చెల్లించాలని ఆదేశం!

13 Nov, 18:39

అంతర్జాతీయ క్రికెట్‌లో ఎదుర్కోలేని బంతులేవీ ఉండవు.. కారణాలు చెప్పొద్దు: నేటి ఓటమిపై గంభీర్ సీరియస్

13 Nov, 18:34

46 ఏళ్ల క్రితం భూసేకరణ.. పరిహారం ఇవ్వకపోవడంతో అధికారుల కార్లను జప్తు చేసిన కోర్టు!

13 Nov, 18:32

షిర్డీ సాయిబాబా సన్నిధిలో రామ్‌చరణ్‌.. మధ్యాహ్న హారతిలో పాల్గొని ప్రత్యేక పూజలు

13 Nov, 18:19

రూ.20 వసూలు చేసినందుకు రూ.13,000 ఫైన్.. రైల్వే పార్కింగ్ సిబ్బందికి బుద్ధి చెప్పిన వినియోగదారుల కమిషన్

13 Nov, 17:44

తనను ఔట్‌ చేసిన బౌలర్‌కు కోహ్లీ అరుదైన బహుమతి.. ఏమిచ్చాడంటే?

13 Nov, 17:41

ఎల్‌నినోతో హెల్త్‌ ఎమర్జెన్సీ.. భారత్‌కు డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక

13 Nov, 17:29

కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్‌ను కలిసిన మాజీ మంత్రి బుగ్గన

13 Nov, 17:25

మార్కెట్లలో మళ్లీ అమ్మకాల సెగ.. సెన్సెక్స్‌ 318 పాయింట్లు డౌన్

13 Nov, 17:22

అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మంది దుర్మరణం

13 Nov, 17:18

హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన మహేశ్ భగవత్

13 Nov, 17:09
..More Telugu News