Advertisement

టైమ్‌కు ఫ్లాట్‌లు అప్పగించని బిల్డర్లపై రెరా కొరడా.. 10.85 శాతం వడ్డీతో కట్టిన మొత్తం చెల్లించాలని ఆదేశం!

Realty
Advertisement
  • నలుగురు బిల్డర్లపై టీజీ-రేరా చర్యలు
  • గడువు లోగా ఫ్లాట్‌ ఇవ్వని భువన్‌తేజా ఇన్‌ఫ్రా
  • 10.85 శాతం వార్షిక వడ్డీతో రూ.22 లక్షలు చెల్లించాలని ఆదేశం
  • వాణిజ్య యూనిట్‌ అప్పగించని జయత్రి ఇన్‌ఫ్రా
  • 10.85 శాతం వడ్డీతో రూ.60 లక్షలు చెల్లించాలని ఆదేశం
  • మోడీ బిల్డర్స్‌కు రూ.20.05 లక్షల జరిమానా విధించిన రెరా
  • స్టార్‌లైట్‌ సంస్థపై జరిమానా ప్రక్రియ ప్రారంభం
ఇళ్ల కొనుగోలుదారులు, పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చని నాలుగు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలపై తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ నియంత్రణ సంస్థ (టీజీ-రేరా) చర్యలు చేపట్టింది. ఇద్దరు బిల్డర్లు బాధితులకు మొత్తం రూ.60.22 లక్షలు 10.85 శాతం వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. మరో సంస్థకు రూ.20.05 లక్షల జరిమానా విధించింది. నాలుగో సంస్థపై జరిమానా ప్రక్రియ ప్రారంభించింది. నవంబర్‌ 10న జారీ చేసిన నాలుగు వేర్వేరు ఉత్తర్వుల్లో ఈ నిర్ణయాలు వెల్లడించింది.

ఫ్లాట్‌ ఇవ్వకుండా రూ.22.22 లక్షలు వసూలు
భువన్‌ తేజా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన హ్యాపీ హోమ్స్‌ ఫేజ్‌-2 ప్రాజెక్టులో వినుకొండ రవి 2021 అక్టోబరులో ఫ్లాట్‌ కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారు. ఫ్లాట్‌ ధర రూ.20.79 లక్షలుగా నిర్ణయించారు. 36 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి అప్పగిస్తామని, అదనంగా ఆరు నెలల గడువు ఉంటుందని సంస్థ హామీ ఇచ్చింది.

కొవిడ్‌ కారణంగా జాప్యం జరుగుతోందంటూ ఫేజ్‌-1లో మరో ఫ్లాట్‌ తీసుకోవాలని సంస్థ సూచించింది. ఇందుకోసం అదనంగా రూ.1.43 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా రూ.22.22 లక్షలు తీసుకున్నా నిర్మాణం ప్రారంభించలేదు. ఫ్లాట్‌నూ అప్పగించలేదు. ఈ ప్రాజెక్టుకు రేరా నమోదు, అవసరమైన అనుమతులు లేవని గుర్తించిన సంస్థ.. కొనుగోలుదారుడికి మొత్తం సొమ్మును 10.85 శాతం వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

వాణిజ్య స్థలం కోసం రూ.38 లక్షలు
జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన వెస్ట్రన్‌ వేవ్స్‌ ప్రాజెక్టులో ముగ్గురు పెట్టుబడిదారులు రూ.38 లక్షలు చెల్లించారు. నానక్‌రామ్‌గూడలోని ఈ ప్రాజెక్టులో 500 చదరపు అడుగుల నిర్మిత విస్తీర్ణం ఉన్న సెమీ ఫినిష్డ్‌ వాణిజ్య యూనిట్‌తో పాటు 11.5 చదరపు గజాల అవిభాజ్య భూమి వాటాను అందిస్తామని సంస్థ ఒప్పందం చేసుకుంది. 2024 డిసెంబరులోగా స్వాధీనం చేస్తామని హామీ ఇచ్చినా ప్రాజెక్టు పూర్తి చేయలేదు.

ఈ ప్రాజెక్టుకు కూడా రేరా నమోదు లేదని అధికారులు గుర్తించారు. గతంలో ఇదే సంస్థ, ప్రాజెక్టుపై వచ్చిన మరో ఫిర్యాదులో రూ.5 లక్షల జరిమానాతో పాటు డబ్బు వాపసు చేయాలని ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు. తాజాగా ముగ్గురు పెట్టుబడిదారులకు రూ.38 లక్షలను 10.85 శాతం వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించారు.

అసంపూర్తి వసతులపై రూ.20.05 లక్షల జరిమానా
మోదీ బిల్డర్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన కీసర మండలం రాంపల్లి దాయరాలోని గోల్డెన్‌ కౌంటీ ప్రాజెక్టుపై విల్లాల యజమానులు, వారి సంఘం ఫిర్యాదు చేశారు. విలాసవంతమైన గేటెడ్‌ కమ్యూనిటీ పేరుతో క్లబ్‌హౌస్‌, స్విమ్మింగ్‌ పూల్‌, జిమ్‌, క్రీడా సదుపాయాలు, పార్కులు కల్పిస్తామని ప్రచారం చేసినా.. 2021లోనే నివాసాలు ప్రారంభమైనప్పటికీ చాలా సదుపాయాలు అసంపూర్తిగా ఉన్నాయని ఆరోపించారు. 2019 నుంచి 2023 మధ్య ఒక్కొక్కరి నుంచి క్లబ్‌హౌస్‌, ఇతర వసతుల కోసం రూ.5 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు.

ఈ ప్రాజెక్టుకు హెచ్‌ఎండీఏ అనుమతి, రేరా నమోదు ప్లాట్ల అభివృద్ధి కోసం మాత్రమే తీసుకున్నారని.. కానీ సంస్థ విల్లాల ప్రాజెక్టుగా ప్రచారం చేసిందని టీజీ-రేరా గుర్తించింది. నిబంధనల ఉల్లంఘనపై రూ.20.05 లక్షల జరిమానా విధించింది.

కొండాపూర్‌ ప్రాజెక్టుపై మరో చర్య
స్టార్‌లైట్‌ గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన స్టార్‌లైట్‌ సెరెనా ప్రాజెక్టుపైనా టీజీ-రేరా చర్యలు ప్రారంభించింది. కొండాపూర్‌లోని తమ భూమిలో కొంత భాగాన్ని కలుపుకుని ప్రాజెక్టును అభివృద్ధి చేసి, ప్రచారం చేస్తున్నారని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఫిర్యాదు చేశారు. ఈ భూమిపై ఇప్పటికే సివిల్‌ కోర్టుల్లో యాజమాన్య వివాదాలు కొనసాగుతున్నాయి.

రేరా చట్టంలోని సెక్షన్‌ 3(1)ను ఉల్లంఘిస్తూ నమోదు చేయని ప్రాజెక్టును ప్రచారం చేసినట్లు సంస్థ గుర్తించింది. సెక్షన్‌ 59 ప్రకారం జరిమానా విధించేందుకు చర్యలు ప్రారంభించాలని కార్యదర్శిని ఆదేశించింది.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

TG RERABhuvan Teja InfraJayatri InfraModi BuildersTelangana RERA penaltydelayed flat possession refund

More Telugu News

మూడ్నాలుగు విజిల్స్ వచ్చినా కుక్కర్ లో అన్నం, పప్పు ఉడకలేదు.. కేసు గెలిచిన విశాఖ మహిళ!

13 Nov, 18:52

అంతర్జాతీయ క్రికెట్‌లో ఎదుర్కోలేని బంతులేవీ ఉండవు.. కారణాలు చెప్పొద్దు: నేటి ఓటమిపై గంభీర్ సీరియస్

13 Nov, 18:34

46 ఏళ్ల క్రితం భూసేకరణ.. పరిహారం ఇవ్వకపోవడంతో అధికారుల కార్లను జప్తు చేసిన కోర్టు!

13 Nov, 18:32

షిర్డీ సాయిబాబా సన్నిధిలో రామ్‌చరణ్‌.. మధ్యాహ్న హారతిలో పాల్గొని ప్రత్యేక పూజలు

13 Nov, 18:19

రూ.20 వసూలు చేసినందుకు రూ.13,000 ఫైన్.. రైల్వే పార్కింగ్ సిబ్బందికి బుద్ధి చెప్పిన వినియోగదారుల కమిషన్

13 Nov, 17:44

తనను ఔట్‌ చేసిన బౌలర్‌కు కోహ్లీ అరుదైన బహుమతి.. ఏమిచ్చాడంటే?

13 Nov, 17:41

ఎల్‌నినోతో హెల్త్‌ ఎమర్జెన్సీ.. భారత్‌కు డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక

13 Nov, 17:29

కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్‌ను కలిసిన మాజీ మంత్రి బుగ్గన

13 Nov, 17:25

మార్కెట్లలో మళ్లీ అమ్మకాల సెగ.. సెన్సెక్స్‌ 318 పాయింట్లు డౌన్

13 Nov, 17:22

అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మంది దుర్మరణం

13 Nov, 17:18

హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన మహేశ్ భగవత్

13 Nov, 17:09

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఎల్లుండికి వాయుగుండంగా బలపడే అవకాశం

13 Nov, 16:45

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై సీఎం చంద్రబాబుపై మండిపడ్డ వైఎస్ షర్మిల

13 Nov, 16:37

నాటి ఆలోచన మార్చుకున్నా.. జనాభా విధానంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

13 Nov, 16:35
..More Telugu News