ఎల్‌నినోతో హెల్త్ ఎమర్జెన్సీ.. భారత్‌కు డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక
Advertisement
- ఎల్‌నినో ప్రభావంతో ఆరోగ్య ముప్పులు పెరిగే అవకాశముందన్న డబ్ల్యూహెచ్‌ఓ
- అత్యున్నత స్థాయి అత్యవసర స్పందనను ప్రారంభించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
- భారత్‌ను హైరిస్క్ దేశంగా గుర్తించి అప్రమత్తం చేసిన వైనం
- వడగాలులు, డెంగీ, మలేరియా, నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు, పోషకాహార లోపం ప్రధాన ప్రమాదాలు
- ముందస్తు హెచ్చరికలు, వైద్య సన్నద్ధత, తాగునీటి భద్రతను బలోపేతం చేయాలని సూచన
ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వడగాలులు, కరవు, అంటువ్యాధులు, ఆహార కొరత వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. ఈ ముప్పును దృష్టిలో ఉంచుకుని అత్యున్నత స్థాయి అత్యవసర స్పందనను ప్రారంభించింది. భారత్‌ను అధిక లేదా అత్యధిక ఆరోగ్య ముప్పు ఎదుర్కొనే దేశాల జాబితాలో చేర్చింది. దక్షిణాసియాలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్న నేపథ్యంలో ముందస్తు సన్నద్ధత అవసరమని స్పష్టం చేసింది.
అత్యున్నత స్థాయి అత్యవసర స్పందన
నవంబర్ 2న విడుదల చేసిన వ్యూహాత్మక సన్నద్ధత, స్పందన ప్రణాళికలో డబ్ల్యూహెచ్‌ఓ ఈ విషయాలను వెల్లడించింది. 2026 అక్టోబర్ నుంచి 2027 సెప్టెంబర్ వరకు గ్రేడ్-3 స్థాయి అత్యవసర స్పందన కొనసాగనుంది. ఇది సంస్థలో అత్యున్నత స్థాయి స్పందన. వ్యాధుల గుర్తింపు, పర్యవేక్షణ, నివారణ, వైద్య సేవలు, సమన్వయంపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. తొలి 6 నెలల కార్యకలాపాల కోసం సుమారు 3.5 కోట్ల డాలర్ల నిధులు అవసరమని అంచనా వేసింది. ఎల్‌నినో నేరుగా వ్యాధులకు కారణం కాదని, వాతావరణ పరిస్థితులను మార్చి ఆరోగ్య సమస్యలు పెరిగేలా చేసే ప్రమాద కారకమని డబ్ల్యూహెచ్‌ఓ వివరించింది.
భారత్‌కు పొంచి ఉన్న ప్రధాన ముప్పులు
సెప్టెంబర్ 5న విడుదలైన ప్రపంచ ఆరోగ్య పరిస్థితుల అంచనాలో భారత్‌ను అధిక లేదా అత్యధిక ముప్పు ఉన్న దేశంగా గుర్తించింది. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మాల్దీవులకూ ఇదే తరహా ప్రమాదాలున్నాయని పేర్కొంది.
తీవ్ర ఉష్ణోగ్రతలు: వడగాలుల వల్ల డీహైడ్రేషన్, వడదెబ్బ, గుండె, శ్వాసకోశ, మూత్రపిండాల సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారికి ముప్పు ఎక్కువ.
డెంగీ, మలేరియా: ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో మార్పులు దోమల వ్యాప్తిపై ప్రభావం చూపుతాయి. నీటి కొరతతో ఇళ్లలో నిల్వ చేసే నీటి పాత్రలు దోమల పెరుగుదలకు కారణం కావచ్చు. ఈశాన్య భారతంలో మలేరియా ముప్పునూ నివేదిక ప్రస్తావించింది.
నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు: వరదలు, పారిశుద్ధ్య సమస్యల వల్ల తాగునీరు కలుషితమై లెప్టోస్పిరోసిస్ వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది.
ఆహార కొరత, పోషకాహార లోపం: వర్షాలు తగ్గితే పంటల దిగుబడి, వ్యవసాయ ఆధారిత ఉపాధి దెబ్బతింటాయి. ఐదేళ్లలోపు పిల్లలు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార సమస్యలు పెరిగే అవకాశం ఉంది.
వైద్య సేవలకు అంతరాయం: తీవ్ర వాతావరణ పరిస్థితులు ఆసుపత్రులు, ఔషధ సరఫరా వ్యవస్థలను ప్రభావితం చేయవచ్చు. మధుమేహం, గుండె, మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారికి చికిత్స అందడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు.
రుతుపవనాలపైనా ప్రభావం?
భారత వ్యవసాయం, తాగునీటి అవసరాలు రుతుపవనాలపై ఆధారపడి ఉండటంతో వర్షపాతంలో మార్పులు కీలకంగా మారనున్నాయి. 2026 ఆగస్టులో పార్లమెంటుకు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. సీజన్ మొత్తంలో దీర్ఘకాలిక సగటులో 90 శాతం వర్షాలు కురిసే అవకాశముందని, అంచనాలో 4 శాతం వరకు తేడా ఉండవచ్చని పేర్కొంది.
అయితే ఎల్‌నినో ఏర్పడితే రుతుపవనాలు పూర్తిగా విఫలమవుతాయని చెప్పలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎల్‌నినో తీవ్రత, ఏర్పడే సమయం వంటి ఇతర వాతావరణ పరిస్థితుల ప్రభావంపైనా వర్షపాతం ఆధారపడి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో కరవు పరిస్థితులు ఏర్పడితే, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు, వరదలు సంభవించవచ్చు.
ఎవరికి ఎక్కువ ప్రమాదం?
పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, వైకల్యాలున్నవారు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశముంది. పట్టణ మురికివాడలు, మారుమూల ప్రాంతాల్లో నివసించేవారికి సురక్షిత తాగునీరు, పారిశుద్ధ్యం, చల్లదనం కల్పించే సదుపాయాలు, వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం మరో సమస్య. వ్యవసాయ కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు, వీధి వ్యాపారుల వంటి బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు వడగాలుల బారిన పడే ప్రమాదం ఉంది. ఉపాధి కోల్పోవడం, ఆహార కొరత, వలసల వంటి పరిణామాలు మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.
ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచన
వాతావరణ మార్పులు అత్యవసర పరిస్థితులుగా మారకముందే స్పందించాలన్నది డబ్ల్యూహెచ్‌ఓ ప్రణాళికలోని ప్రధాన ఉద్దేశం. వ్యాధుల పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించింది. అవసరమైన మందుల నిల్వలు, ఆసుపత్రుల్లో అత్యవసర సేవల కొనసాగింపు, వాతావరణ శాఖలు, ఆరోగ్య విభాగాలు, విపత్తు నిర్వహణ సంస్థల మధ్య సమన్వయం పెంచాలని పేర్కొంది.
భారత్‌లో డెంగీ, మలేరియా నివారణ చర్యలు, సురక్షిత తాగునీటి సరఫరా, వడగాలులను ఎదుర్కొనే వైద్య సన్నద్ధతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎల్‌నినోతో దేశంలోని ప్రతి ప్రాంతంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడుతుందని ఈ హెచ్చరిక అర్థం కాదని, స్థానిక వాతావరణ పరిస్థితులు, ముందస్తు సన్నద్ధతను బట్టి ప్రభావం మారుతుందని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది.