ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై సీఎం చంద్రబాబుపై మండిపడ్డ వైఎస్ షర్మిల
Advertisement
- రాష్ట్రంలో ఫీజు బకాయిలు రూ.6,400 కోట్లు దాటాయన్న షర్మిల
- అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో క్లియర్ చేస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్న
- ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ఈ పథకం నిర్వీర్యమైపోయిందని, ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు.
వైఎస్సార్ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం పేదవాడి చదువుకు పండుగలా ఉండేదని గుర్తుచేశారు. నేడు చంద్రబాబు పాలనలో అదే పథకం వేల కోట్ల బకాయిలతో చదువంటేనే దండుగగా మారిపోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఈ పథకం బకాయిలు రూ.6,400 కోట్లు దాటిపోయాయని, అందులో గత మూడేళ్లలోనే రూ.6,000 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయని ఆమె తెలిపారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని షర్మిల దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్ని బకాయిలు క్లియర్ చేస్తామని, నేరుగా కాలేజీల ఖాతాల్లోకి నిధులు జమ చేస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని ఆమె నిలదీశారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు దక్కక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఒకవైపు రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని భారీ ప్రచారాలు చేసుకుంటూ, మరోవైపు పేద విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను పెంచుకుంటూ పోవడం సరికాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.