Advertisement

రాప్తాడు బాలికకు ఆర్థిక సాయం అందించిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Andhra
Advertisement
  • రాప్తాడు ప్రభుత్వ పాఠశాలతో విద్యార్థినిపై ఉన్మాది దాడి
  • ఈ ఘటనలో గాయపడిన బాలిక లక్ష్మిని అనంతపురం ఆసుపత్రిలో పరామర్శించిన తోపుదుర్తి
  • లక్ష్మి కుటుంబానికి రూ. 3 లక్షల చెక్ అందించిన మాజీ ఎమ్మెల్యే
రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన దాడి ఘటనలో గాయపడిన పదో తరగతి విద్యార్థిని లక్ష్మికి వైసీపీ అండగా నిలిచింది. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అనంతపురంలోని ఆసుపత్రికి వెళ్లి లక్ష్మిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పార్టీ తరఫున ప్రకటించిన రూ.3 లక్షల ఆర్థిక సాయం చెక్కును లక్ష్మి కుటుంబానికి అందజేశారు.

పాఠశాల తరగతి గదిలో తోటి విద్యార్థిని గోపికపై జరిగిన దాడిని అడ్డుకునేందుకు లక్ష్మి సాహసోపేతంగా ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరింది. ఇటీవల జగన్ ఫోన్ ద్వారా లక్ష్మితో మాట్లాడి ఆమె ధైర్యాన్ని అభినందించారు. వైద్య ఖర్చులతో పాటు అన్ని విధాలా అండగా ఉంటామని ఆమె కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఆ హామీ మేరకు తోపుదుర్తి స్వయంగా వెళ్లి చెక్కును అందజేశారు.

మరోవైపు, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని గోపిక కుటుంబానికి కూడా జగన్ రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. గతంలోనే ఆయన బెంగళూరు వెళ్లి గోపికను పరామర్శించిన విషయం తెలిసిందే. గోపిక కుటుంబానికి కూడా త్వరలోనే రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కును అందజేస్తామని తోపుదుర్తి వెల్లడించారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Topudurthi Prakash ReddyYS Jagan Mohan ReddyRaptadu school attackYSRCP financial aid

More Telugu News

విల్ యంగ్ కెరీర్ బెస్ట్ సెంచరీ.. భార‌త్ ముందు భారీ టార్గెట్‌

13 Nov, 11:58

ఏఐతో పెను ప్రమాదం.. గూగుల్, మెటాపై కోర్టులో వ్యాజ్యం

13 Nov, 11:30

రోడ్ల ఆధునికీకరణపై మేధోమథనం.. హైటెక్స్‌ వేదికగా ఇండియన్ రోడ్ కాంగ్రెస్: కోమటిరెడ్డి

13 Nov, 11:28

హైదరాబాద్ సీపీగా ఇక సెలవు.. వీసీ సజ్జనార్ భావోద్వేగ సందేశం

13 Nov, 11:15

హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ వద్ద మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ధర్నా

13 Nov, 10:54

భవనం మధ్యలోంచి దూసుకెళ్లనున్న మెట్రో రైలు.. చెన్నైలో వినూత్న ప్రాజెక్ట్

13 Nov, 10:50

రూ.3.50 లక్షలకే ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రక్రియ

13 Nov, 10:47

నెల్లూరు, వైజాగ్, తిరుపతిలో కొత్త స్టార్ హోటళ్లు: మంత్రి కందుల దుర్గేశ్ కీలక ప్రకటన

13 Nov, 10:45

హైదరాబాద్‌లో 4 పీఆర్‌టీఎస్ కారిడార్లు.. ఏడాదిలోనే తొలిదశ పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి

13 Nov, 10:24

ఖవాజాను బలిపశువును చేశాడు.. కమిన్స్‌పై వార్నర్ ఫైర్!

13 Nov, 10:21

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి అరుదైన గౌరవం

13 Nov, 10:18

'నేనొక పనికిమాలిన వాడిని'.. రాజీనామా స‌మ‌యంలో కుంగిపోయిన జెన్సన్ హువాంగ్!

13 Nov, 10:01

రెండేళ్లలో భారత్‌లోనే సొంతంగా విమానాల తయారీ: రామ్మోహన్‌ నాయుడు

13 Nov, 09:46

చేతిలోని నగదు బ్యాగ్‌ లాక్కెళ్లిన కోతి.. చెట్టుపై నుంచి డబ్బుల వర్షం.. ఇదిగో వీడియో!

13 Nov, 09:29
..More Telugu News