Advertisement

సంక్రాంతి తర్వాత సునామీ.. మోదీ, కేసీఆర్ కొట్టుకుపోతారు: రేవంత్

Telangana
Advertisement
  • మోదీ అయినా, కేడీ అయినా తనకు భయం లేదన్న ముఖ్యమంత్రి
  • కొడంగల్ అభివృద్ధికి అడ్డువస్తే ఎవరైనా తలవంచాల్సిందేనని హెచ్చరిక
  • సంక్రాంతి తర్వాత 'ప్రజాబలం'తో సునామీ సృష్టిస్తామని ప్రకటన
  • రాష్ట్రంలో కరువు పరిస్థితులపై ప్రజలకు, రైతులకు కీలక సూచనలు
  • గడ్డం పెంచుకుంటే కేటీఆర్ తనలా కాలేరంటూ తీవ్ర విమర్శలు
తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా, రాష్ట్రంలోని ప్రతిపక్ష బీఆర్ఎస్‌పైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అభివృద్ధి విషయంలో ఢిల్లీ పెద్దలైనా, ఫామ్‌హౌస్ నాయకులైనా ఎవరికీ భయపడేది లేదని, అడ్డు వస్తే తలవంచాల్సిందేనని స్పష్టం చేశారు. కొడంగల్ ప్రజల ఆశీర్వాదం ఉంటే ఢిల్లీనైనా ఎదిరించి నిలబడతానని ధీమా వ్యక్తం చేశారు.

సోమవారం కొడంగల్‌లో జరిగిన రైతు ఆత్మీయ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ "ఢిల్లీలో ఉన్న మోదీ అయినా, ఫామ్‌హౌస్‌లో ఉన్న కేడీ (కేసీఆర్) అయినా భయపడే ప్రసక్తే లేదు" అని అన్నారు. సంక్రాంతి తర్వాత 'ప్రజాబలం' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి సునామీ సృష్టిస్తామని, ఆ సునామీలో మోదీ, కేసీఆర్‌లు కొట్టుకుపోతారని వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఘాటు విమర్శలు చేశారు. గడ్డం పెంచుకున్నంత మాత్రాన నాయకత్వ లక్షణాలు రావని, పది జన్మలు ఎత్తినా కేటీఆర్ తనలా కాలేరని ఎద్దేవా చేశారు.

తన మూడ్రోజుల పర్యటనలో భాగంగా ఆయన లగచర్లలో ఎకో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశముందని, రైతులు నీటిని పొదుపుగా వాడుతూ ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. బియ్యం నిల్వలపై ఆందోళన వద్దని, ఏడాదికి సరిపడా నిల్వలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని భరోసా ఇచ్చారు.

గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం రూ. 8 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా 2028 డిసెంబరు నాటికి కొడంగల్‌కు కృష్ణా జలాలు తీసుకొచ్చి తీరుతామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి కొడంగల్‌కు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు, పారిశ్రామిక వాడల అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని, రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని చెప్పారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Revanth ReddyNarendra ModiK Chandrashekar RaoKodangalTelangana PoliticsBRS vs Congress

More Telugu News

పండగ ముగిసింది.. బాదుడు మొదలైంది.. విమాన ప్రయాణం ఇక భారమే!

10 Nov, 08:50

చైనా మహిళతో సంబంధం.. ఎన్విడియా సీఈఓ హువాంగ్‌కు కష్టాలు.. వేల కోట్ల సంపద ఆవిరి

10 Nov, 08:43

ఆ ఒక్క సలహా నా కెరీర్‌నే మార్చేసింది.. నా విజయ రహస్యం అదే: రవిశాస్త్రి

10 Nov, 08:17

ఇరాన్‌తో యుద్ధం ముగిసినట్లే.. ఖతార్ ప్రధానితో భేటీ తర్వాత ట్రంప్ వ్యాఖ్యలు

10 Nov, 08:02

వివాదంతో వెనక్కి తగ్గిన వివేక్ అగ్నిహోత్రి.. ట్వీట్ డిలీట్

10 Nov, 07:53

అనంతపురం ఆసుపత్రిలో బెడ్ పైనుంచి కిందపడిన రాప్తాడు దాడి నిందితుడు

10 Nov, 07:40

1.80 లక్షల ఎకరాల్లో భారీ నగరం.. ఫ్యూచర్ సిటీ ప్లాన్ రెడీ

10 Nov, 07:38

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. వైద్యశాఖలో 2,929 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం

10 Nov, 07:08

13 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి.. విడిపోతున్నట్టు ప్రకటించిన పవన్, లెజినోవా

10 Nov, 06:51

ఉద్యోగి 48 గంటలు కస్టడీలో ఉంటే సస్పెన్షన్ అయినట్లే: సుప్రీంకోర్టు

10 Nov, 06:30

పదవిని వీడే ముందు భారీగా క్షమాభిక్షలు: ట్రంప్ సంచలన ప్రకటన

10 Nov, 06:25

గుండెపోటు అనుకుంటే హత్య: ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిన భార్య

10 Nov, 06:18

మీ వాహనం ఉందేమో చూసుకోండి!.. 510 వాహనాల వేలంపై మల్కాజ్‌గిరి పోలీసుల ప్రకటన

09 Nov, 22:52

అవకాశాల కల్పనలో ఏపీ మేటి.. యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్‌లో రెండో స్థానం.. చంద్రబాబు స్పందన

09 Nov, 22:44
..More Telugu News