అడవిలో కాలుపెడితే అదృశ్యమే: ఓటీటీలో 'ది వన్'

Entertainment
Advertisement
  • ఉత్కంఠను రేకెత్తించే 'ది వన్'
  • ఫారెస్టు చుట్టూ తిరిగే కథ
  • ప్రధానమైన పాత్రలలో సిద్ధార్థ్ మల్హోత్రా - తమన్నా
  • ఈ నెల 6వ నుంచి మొదలైన స్ట్రీమింగ్
  • అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో
అది ఒక దట్టమైన అడవి .. పొద్దుపోయిన తరువాత ఆ అడవి వైపు ఎవరూ వెళ్లరు. ఏం కాదులే అంటూ అటుగా వెళ్లిన వాళ్లెవరూ తిరిగి రాలేదు. అడవిలో వనదేవత విహరిస్తూ ఉంటుందనీ .. ఆ సమయంలో  ఎవరైనా అటుగా వెళితే చంపేస్తుందని అంతా భావిస్తుంటారు. అలాంటి పరిస్థితులలో 'రిషి' తన భార్య 'మమత'ను తీసుకుని ఆ గ్రామానికి చేరుకుంటాడు. తన పూర్వీకులకు సంబంధించిన ఆస్తిపాస్తులను అమ్ముకుని వెళ్లడానికి వస్తాడతను. తాను వచ్చిన పనిని పూర్తి చేయడానికి అడ్డుగా ఉన్న అడవిని టచ్ చేయడానికి అతను సిద్ధపడతాడు. 

ఆ గ్రామస్తులంతా కూడా ఆ అడవి వనదేవత నివాసమనీ, అలాంటి అడవి జోలికి వెళితే వనదేవతకి ఆగ్రహం కలుగుతుందని రిషికి చెబుతారు. అదంతా ఒక మూఢనమ్మకం అని భావించిన రిషి లైట్ తీసుకుంటాడు. తాను అనుకున్న పనిని పూర్తి చేసే తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అప్పటి నుంచి అతనికి ఎలాంటి చిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి? దాంతో అతను తన నిర్ణయాన్ని మార్చుకుంటాడా? మూర్ఖంగా ముందుకు వెళతాడా? అనేది కథ. 

ఈ కథ అంతా కూడా 'ది వన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' అనే సినిమాకి సంబంధించినది. అడ్వెంచర్ తో ముడిపడిన హారర్ యాక్షన్ మూవీ ఇది. ఏక్తా కపూర్ - శోభా కపూర్ నిర్మించిన ఈ సినిమాకి, దీపక్ మిశ్రా దర్శకత్వం వహించాడు. సిద్ధార్థ్ మల్హోత్రా - తమన్నా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, సెప్టెంబర్ 25వ తేదీన థియేటర్లకు వచ్చింది. అమిత్ త్రివేది - సామ్ సీఎస్ నేపథ్య సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఈ నెల 6వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 

Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

The One Force of the ForestSiddharth MalhotraTamannaahAmazon Prime VideoDeepak MishraHorror Action Movie

More Telugu News

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్.. జనవరిలో ప్రకటనకు ఈసీ కసరత్తు!

09 Nov, 16:04

చదివితే ఉద్యోగం ఖాయమనే రోజులు పోయాయా? చైనా ఉదాహరణతో భారత యువతకు వెంబు హెచ్చరిక

09 Nov, 15:59

కాలుష్యం నుంచి ఆహారం రక్షిస్తుందా? ఈ పోషకాలు మీ డైట్‌లో ఉండాల్సిందే!

09 Nov, 15:55

బెంగాల్‌లో వింత ఘటన.. ఎన్‌క్లోజర్ కింద సొరంగం తవ్వి పారిపోయిన ఆడపులి

09 Nov, 15:51

1930లలో సంఘ్‌ను సమర్థించిన ఏకైక వ్యక్తి ఇబ్రహీం: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్

09 Nov, 15:49

'పుష్ప 2', 'ధురంధర్ 2' రికార్డులు బ్రేక్.. బుకింగ్స్ లో 'రామాయణ' సంచలనం!

09 Nov, 15:37

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆన్‌లైన్‌లో టీటీడీ 2027 క్యాలెండర్లు, డైరీల బుకింగ్ ప్రారంభం

09 Nov, 15:18

మేకపాటి సొంతూరులోనూ టీడీపీ గెలిచింది: ఆనం రామనారాయణరెడ్డి

09 Nov, 15:17

రాత్రంతా ఆగితేనే అసలు మజా.. వండిన వెంటనే కన్నా మరుసటి రోజు తింటే రుచి రెట్టింపయ్యే వంటకాలివే!

09 Nov, 15:07

ప్రజల తీర్పును గౌరవిస్తాం.. బాధ్యతగా పనిచేయాలి: ఎంపీ కేశినేని చిన్ని

09 Nov, 15:01

అక్టోబర్‌లో అత్యధికంగా అమ్ముడైన టాప్‌-10 కార్లు ఇవే!

09 Nov, 14:49

స్నేహితురాలి బాధతో స్ఫూర్తి.. రుతుక్రమ సమస్యలపై పోరాటం.. ఢిల్లీ విద్యార్థికి డయానా అవార్డు

09 Nov, 14:40

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన కీసర ఎస్సై

09 Nov, 14:39

ఈ వారం ఓటీటీ తెరపైకి వస్తున్న భారీ సినిమాలు ఇవే!

09 Nov, 14:38
..More Telugu News