సినీ ఎంట్రీకి శ్రీదేవి పెట్టిన కండిషన్.. తల్లి గురించి సంచలన నిజం బయటపెట్టిన జాన్వీ కపూర్!

Entertainment
Advertisement
  • తన సినీ ప్రవేశంపై తల్లి శ్రీదేవి తొలుత సంశయించారని చెప్పిన జాన్వీ
  • నటి కావాలంటే జీవితాన్నే అంకితం చేయాలని శ్రీదేవి చెప్పినట్లు వెల్లడి
  • ముక్కు సర్జరీ చేయించుకున్న తర్వాతే అమ్మ తనను ప్రోత్సహించిందని వ్యాఖ్య
  • సర్జరీకి ముందు తనలో అంత పొటెన్షియల్ లేదన్నట్లు అమ్మ భావించేదని కామెంట్
  • గతంలో శ్రీదేవి కూడా ముక్కు సర్జరీ చేయించుకున్నారని గుర్తు చేసిన జాన్వీ
దివంగత అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె, యువ నటి జాన్వీ కపూర్ తన తల్లి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తాను నటిని అవుతానని చెప్పినప్పుడు శ్రీదేవి మొదట ఎలా స్పందించారో, ఆ తర్వాత ఆమె అభిప్రాయం ఎలా మారిందో తాజాగా వెల్లడించారు. తాను ముక్కుకు సర్జరీ చేయించుకున్న తర్వాతే, తనలో నటి కాగలననే నమ్మకం తన తల్లికి కలిగిందని జాన్వీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

ఇటీవల గలాటా ప్లస్ తమిళ్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీ తన కజిన్, నటి మహేశ్వరితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "నేను నటిని అవుతానని అమ్మతో చెప్పినప్పుడు, ఆమె మొదట కొంచెం సంశయించారు. 'సరే, కానీ దీని కోసం నీ జీవితాన్నే అంకితం చేయాలి' అని అన్నారు" అని గుర్తుచేసుకున్నారు. దీనిపై మహేశ్వరి కూడా స్పందిస్తూ.. సినీ రంగంలో రాణించడానికి ఎంత కష్టపడాలో, ఎంత అంకితభావం అవసరమో శ్రీదేవికి తెలుసని, అందుకే ఆమె ఆందోళన చెందారని తెలిపారు.

ఈ సంభాషణలోనే జాన్వీ ఒక సున్నితమైన విషయాన్ని బయటపెట్టారు. "ఈ విషయాన్ని మీరు కట్ చేస్తారేమో, కానీ నేను ముక్కుకు సర్జరీ చేయించుకోకముందు, అమ్మ అంత నమ్మకంగా లేరు. నేను నటిని కాగలనా అని ఆమెలో సందేహం ఉండేది. కానీ, సర్జరీ తర్వాత 'పర్లేదు, నీలో పొటెన్షియల్ ఉంది' అన్నట్లుగా ఆమె అభిప్రాయం మారింది" అని జాన్వీ అంగీకరించారు.

గతంలో కూడా తన తల్లి శ్రీదేవి మార్గదర్శకత్వంలోనే తాను కొన్ని కాస్మెటిక్ సర్జరీలు చేయించుకున్నట్లు జాన్వీ తెలిపారు. అంతేకాదు, శ్రీదేవి సైతం తన కెరీర్‌లో ముక్కుకు సర్జరీ చేయించుకున్నారని, అది తమ కుటుంబంలో ఒక ముఖ్యమైన మార్పుగా నిలిచిపోయిందని జాన్వీ గతంలో పేర్కొన్నారు. 

శ్రీదేవి మరణించిన కొన్ని నెలలకే 2018లో 'ధడక్' చిత్రంతో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తన తల్లితో ఉన్న అనుబంధం, కెరీర్ తొలినాళ్లలోని విషయాలను జాన్వీ పంచుకోవడం ఇదే మొదటిసారి కాదు. అయితే, సర్జరీకి సంబంధించిన ఈ వ్యాఖ్యలు కొత్తగా వెలుగులోకి వచ్చాయి.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Janhvi KapoorSrideviNose SurgeryBollywood NewsGalatta PlusMaheswari

More Telugu News

ఘోర పరాభవం... అయినా తగ్గేదేలే.. డెమోక్రాట్లతో ఢీకి ట్రంప్ సై!

09 Nov, 08:34

భార‌త్‌తో క్రికెట్ ఆడ‌కుంటే అంతే మ‌రి.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు రూ. 627కోట్ల న‌ష్టం!

09 Nov, 08:33

ముంబై ఎయిర్‌పోర్ట్ సర్వీస్‌పై అద్నాన్ సమీ ఫైర్.. 'మర్యాద నేర్చుకోండి' అంటూ ఘాటు స్పందన

09 Nov, 08:14

ఢిల్లీ హిట్టర్‌ కోసం గుజరాత్ ప్రయత్నాలు.. బౌలర్‌ను ఇచ్చి బ్యాటర్‌ను తీసుకునే ప్లాన్?

09 Nov, 08:11

ఆన్‌లైన్‌లో అమ్మేందుకు బాలుడి హత్య.. కిడ్నీలు, కళ్లు తీసిన కిరాతకుడు

09 Nov, 07:58

61 సీట్ల గండం గట్టెక్కేదెలా?.. ఇజ్రాయెల్ ప్రభుత్వ ఏర్పాటుకు ఐజెన్‌కాట్ వ్యూహ ప్రతివ్యూహాలు

09 Nov, 07:48

నల్గొండలో కారుణ్య నియామకం స్కాం: నకిలీ డెత్ సర్టిఫికెట్‌తో ఉద్యోగం.. 14 మంది అరెస్ట్

09 Nov, 07:20

టెక్ ప్రపంచంలో సంచలనం.. చైనా గూఢచారితో ఎఫైర్ నిజమేనన్న ఎన్విడియా సీఈవో

09 Nov, 07:02

ప్రకాశం బ్యారేజీకి తగ్గిన వరద.. ఊపిరి పీల్చుకున్న డెల్టా రైతులు

09 Nov, 06:31

దీపావళి పార్టీలో మాజీ భర్తతో ఈషా డియోల్

09 Nov, 06:27

దీపావళికి సర్‌ప్రైజ్.. కొడుకు ఫొటోను తొలిసారిగా చూపించిన కత్రినా, విక్కీ!

09 Nov, 06:20

అమెరికా చరిత్రలో ఇది భారీ తిరోగమనం.. ఎన్నికల్లో ఓటమిపై ట్రంప్ వ్యాఖ్యలు

08 Nov, 22:33

అమెరికాలో తెలుగు యువకుడి అనుమానాస్పద మృతి

08 Nov, 22:16

ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తుది ఫలితాలు ప్రకటించిన ఎస్ఈసీ

08 Nov, 21:56
..More Telugu News