కొఠియా గ్రామాల్లో ఓటర్లను అడ్డుకుంటున్న ఒడిశా పోలీసులు.. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వార్నింగ్

Andhra
Advertisement
  • ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మళ్ళీ ఉద్రిక్తత
  • గిరిజనులపై దాడులు చేస్తే సహించబోమన్న మంత్రి సంధ్యారాణి
  • సీఎం చంద్రబాబు కొఠియాపై ప్రత్యేక దృష్టి సారించారని వెల్లడి
Advertisement
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొఠియా గ్రామాల్లో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎన్నికల వేళ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళుతున్న గిరిజనులను ఒడిశా పోలీసులు అడ్డుకుంటూ, వేధింపులకు గురిచేయడం కలకలం రేపింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కొఠియా గ్రామాల్లో పర్యటించి, అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఒడిశా అధికారుల తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ... కొఠియాలోని 29 గ్రామాల్లో ఒడిశా అధికారులు, పోలీసుల ఆగడాలు మితిమీరిపోయాయని విమర్శించారు. గిరిజనులను బెదిరించడం, దాడులు చేయడం, చివరకు కిడ్నాప్‌లకు పాల్పడటం దారుణమన్నారు. "ఎన్నికలు వద్దనుకుంటే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలి కానీ, అమాయక గిరిజనులపై ప్రతాపం చూపడం ఏమిటి?" అని ఆమె ప్రశ్నించారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దును భారత్-పాకిస్థాన్ సరిహద్దులా మార్చవద్దని హెచ్చరించారు. గిరిజనుల రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును అడ్డుకునే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు.

కొఠియా గ్రామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారని, మంత్రి నారా లోకేశ్‌, హోంమంత్రి వంగలపూడి అనిత ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని మంత్రి తెలిపారు.
Advertisement

సంబంధిత వార్తలు

Gummadi SandhyaraniKotia villagesOdisha policeAndhra Odisha border disputeTribal voting rightsAndhra Pradesh elections

More Telugu News

ఎన్నికల విధుల్లో టీచర్ మృతి.. చంద్రబాబు, నారా లోకేశ్ తీవ్ర విచారం

05 Nov, 19:22

ఏపీ క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. భారత్-శ్రీలంక తొలి వన్డే ఢిల్లీ నుంచి విశాఖకు మార్పు

05 Nov, 19:10

ఓటు వేయని జగన్‌కు ఎన్నికలపై మాట్లాడే నైతిక హక్కు లేదు: ధూళిపాళ్ల నరేంద్ర

05 Nov, 18:56

కనిపించకుండా పోయిన చిలుక ఆచూకీ చెప్పండి.. లక్ష రివార్డ్ పొందండి!

05 Nov, 18:45

'హోం రాడికలైజేషన్'.. యువత తల్లిదండ్రులే ఉగ్రవాదుల కొత్త ఆయుధం!

05 Nov, 18:17

ఏపీలో ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్.. ఎల్లుండి కౌంటింగ్

05 Nov, 18:11

బీసీ సంఘాలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆత్మగౌరవ భవనాలకు భారీగా నిధులు

05 Nov, 17:57

బాబర్ ఆజంతో ఇబ్బంది లేదు.. అతడి అభిమానులే విషపూరితం: అజామ్ ఖాన్

05 Nov, 17:50

ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో రిటైర్‌.. 23 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు

05 Nov, 17:17

ఫలితాలు తేడాగా వస్తాయని చంద్రబాబుకు భయం పట్టుకుంది: వల్లభనేని వంశీ

05 Nov, 17:11

గూగుల్‌ ఫొటోస్‌లో కీలక మార్పు.. డిలీట్‌ చేసిన ఫొటోలు 30 రోజులే!

05 Nov, 17:07

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.. ఓటమి భయంతోనే వైసీపీ అరాచకాలు: పల్లా

05 Nov, 16:45

ఈ సినిమాలో యాక్టర్లందరికీ మంచి పేరొస్తుంది: 'సమ్మర్ హాలిడేస్' దర్శకుడు శ్రీకర్ నయన్

05 Nov, 16:34

మురిసిన మార్కెట్లు.. మదుపర్లకు రూ.8 లక్షల కోట్ల లాభం!

05 Nov, 16:30
..More Telugu News