కల్యాణదుర్గం ఎమ్మెల్యేపై దాడికి వైసీపీ యత్నం.. గన్‌మన్‌కు గాయాలు
Advertisement
- అనంతపురం జిల్లా పరిషత్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత
- ఓటేయకుండా అడ్డుకుంటున్నారని సురేంద్రకు మహిళల ఫిర్యాదు
- ఎమ్మెల్యే రాకను గమనించి దాడికి యత్నించిన వైసీపీ శ్రేణులు
Advertisement
పరిషత్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రపై వైసీపీ శ్రేణులు దాడికి యత్నించాయి. ఈ క్రమంలో అడ్డుకున్న ఆయన గన్‌మన్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటనతో కుందుర్పి మండలం బెస్తరపల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
వివరాల్లోకి వెళితే... బెస్తరపల్లి పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ నేతలు తమను ఓటు వేయనీయకుండా బెదిరిస్తున్నారని ‘పొదుపు లక్ష్మి’ బృందానికి చెందిన మహిళలు ఎమ్మెల్యే సురేంద్రకు ఫోన్ చేశారు. దీంతో వారికి ధైర్యం చెప్పేందుకు ఎమ్మెల్యే స్వయంగా పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు.
ఎమ్మెల్యే రాకను గమనించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆయనపై దాడికి ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే గన్‌మన్ వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో గన్‌మన్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో పోలింగ్ కేంద్రం వద్ద ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.