సౌత్ నటిననే వివక్ష చూపారు: కరణ్ జోహార్‌పై రెజీనా సంచలన ఆరోపణలు
Advertisement
- 'కేసరి 2' ప్రమోషన్లలో ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టారన్న రెజీనా
- ప్రమోషన్ల సమయంలో తన పేరు తొలగించారని విమర్శ
- సౌత్ ఇండస్ట్రీపై మాట్లాడిన జాన్వీ, రాధికకు కౌంటర్
Advertisement
ప్రముఖ నటి రెజీనా కసాండ్రా బాలీవుడ్‌పై, ముఖ్యంగా దర్శక నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తాను నటించిన ‘కేసరి చాప్టర్ 2’ సినిమా ప్రమోషన్లలో తనను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టారని, దక్షిణాది నటిని కావడం వల్లే ఈ వివక్ష ఎదురైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలు భారత సినీ పరిశ్రమలో ‘నార్త్ వర్సెస్ సౌత్’ చర్చను మరోసారి రాజేశాయి.
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘కేసరి 2’లో ఆయన భార్యగా కీలక పాత్ర పోషించినప్పటికీ, ప్రమోషన్ల సమయంలో తన పేరును తొలగించారని రెజీనా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. "నాపై చిత్రీకరించిన పాటను విడుదల చేసి, సోషల్ మీడియాలో కనీసం ట్యాగ్ కూడా చేయలేదు. నేను సౌత్ ఇండియన్ నటిని కావడం వల్లే ఇలా చేశారా?" అని ఆమె ప్రశ్నించారు.
ఇటీవల సౌత్ సినిమాలపై జాన్వీ కపూర్, రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలపైనా ఆమె తీవ్రంగా స్పందించారు. ఉత్తరాది నటులు ఇలా బహిరంగంగా మాట్లాడటం వల్ల అనవసరంగా నార్త్-సౌత్ విభేదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. "ఒకవేళ సౌత్ సినిమాలలో పనిచేయడం ఇబ్బందిగా అనిపిస్తే, ఆ ప్రాజెక్ట్‌ల నుంచి బయటకు వెళ్లిపోవాలి. అంతేకానీ తర్వాత దాని గురించి మాట్లాడటం సరికాదు" అని ఆమె సూటిగా అన్నారు.
బాలీవుడ్‌లో తనకు ఎదురైన అనుభవాన్ని, తోటి నటుల వ్యాఖ్యలను ముడిపెడుతూ రెజీనా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అయితే, రెజీనా ఆరోపణలపై ఇప్పటివరకు ధర్మ ప్రొడక్షన్స్ గానీ, కరణ్ జోహార్ గానీ స్పందించలేదు.