కండక్టర్ ప్రవళిక కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం: మంత్రి పొన్నం
Advertisement
- ప్రయాణికురాలి దాడిలో గాయపడిన మహిళా కండక్టర్ ప్రవళిక మృతి
- మృతురాలి తల్లికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని పొన్నం హామీ
- ఉస్మానియా మార్చురీ వద్ద ప్రవళిక మృతదేహానికి నివాళి అర్పించిన మంత్రి
Advertisement
ప్రయాణికురాలి దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన టీజీఎస్ఆర్టీసీ మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక (24) కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ మేరకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున కలిపి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద ప్రవళిక మృతదేహానికి మంత్రి నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రవళిక కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద అక్టోబర్ 25న ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. టికెట్ డబ్బుల చిల్లర విషయమై ప్రయాణికురాలు మౌనికతో జరిగిన గొడవలో... ప్రవళికను కదులుతున్న బస్సు నుంచి కిందకు తోసేయడంతో ఆమె వెనుక చక్రాల కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. పది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి ఆమె కన్నుమూశారు. ఈ ఘటనపై ఇప్పటికే నిందితురాలైన ప్రయాణికురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.