వాసిరెడ్డి పద్మ కూతురు మేఘన ఘన విజయం
Advertisement
- జగ్గయ్యపేట 31వ వార్డులో జనసేన విజయం
- 540 ఓట్ల మెజారిటీతో గెలిచిన అభ్యర్థి మేఘన
- ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ కుమార్తె మేఘన
Advertisement
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో వాసిరెడ్డి మేఘన ఘన విజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్థిపై 540 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మేఘన ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ కుమార్తె కావడంతో ఈ గెలుపు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
మేఘన ఫలితం వెలువడగానే జనసేన, కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఆమె గెలుపు పట్ల పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.
కాగా, వాసిరెడ్డి పద్మ గతంలో వైసీపీలో క్రియాశీలకంగా ఉండేవారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గయ్యపేట టికెట్ ఆశించిన ఆమెకు పార్టీ నుంచి అవకాశం లభించలేదు. అప్పటి నుంచి ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె కుమార్తె జనసేన పార్టీ తరఫున పోటీ చేసి కౌన్సిలర్‌గా గెలవడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.