విజయవాడ మేయర్ పోరులో వంగవీటి రాధా ఆధిక్యం.. రెండో స్థానంలో ఏబీ వెంకటేశ్వరావు
Advertisement
- ఏపీలో కొనసాగుతున్న స్థానిక ఎన్నికల కౌంటింగ్
- విజయవాడ మేయర్ రేసులో ముందంజలో వంగవీటి రాధా
- మూడో స్థానానికి పరిమితమైన వైసీపీ
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్‌లో అందరి దృష్టి విజయవాడ మేయర్ పీఠంపై నిలిచింది. వంగవీటి రాధా జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి తరపున పోటీ చేయగా... కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు బరిలో నిలిచారు. వైసీపీ ఒంటరిగా పోటీ చేసింది. దీంతో, ఇక్కడ ముక్కోణపు పోటీ నెలకొంది.
కౌంటింగ్ తాజా సరళి ప్రకారం, ఇక్కడ అధికార కూటమి తరపున జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్న వంగవీటి రాధా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అనూహ్యంగా ఏబీ వెంకటేశ్వరరావు రెండో స్థానంలో నిలిచారు. వైసీపీ అభ్యర్థి, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మూడో స్థానానికి పరిమితమయ్యారు.
విజయవాడలో ఈ పరిస్థితి ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి పార్టీల అభ్యర్థులే ఆధిక్యత ప్రదర్శిస్తున్నట్లు ట్రెండ్స్ సూచిస్తున్నాయి.